Viral Video : ఫ్రెండ్ కోలా చనిపోయిందని.. దానిని పట్టుకుని ఏడుస్తున్న మరో కోలా.. వీడియో వైరల్

జంతువు చనిపోతే మరో జంతువు ఏడవటం మీరు ఎప్పుడైనా చూసారా? వాటి మధ్య ప్రేమానుబంధాలు లేవనుకునేరు.. ఒక వీడియో చూసి అందరి మనసు చలించిపోతోంది.

Viral Video : ఫ్రెండ్ కోలా చనిపోయిందని.. దానిని పట్టుకుని ఏడుస్తున్న మరో కోలా.. వీడియో వైరల్

Viral Video

Updated On : February 25, 2024 / 4:00 PM IST

Viral Video : మనుష్యుల మధ్య మాత్రమే ప్రేమానుబంధాలు ఉంటాయని అనుకుంటాం. కానీ జంతువుల మధ్య కూడా ఉంటాయని ఓ వీడియో రుజువు చేసింది. తన తోటి కోలా చనిపోతే ఇంకో కోలా దానిని పట్టుకుని ఏడ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Babar Azam : అయ్యో కోపమొచ్చింది..! ప్రేక్షకులపై బాటిల్ విసిరేయబోయిన పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్.. వీడియో వైరల్

జంతువులు మాట్లాడుకోలేవని.. వాటికి ఎమోషన్స్ లేవని అనుకుంటాం. కానీ వాటిలో వాటికి స్నేహం, ప్రేమ ఉంటాయని కొన్ని సంఘటనలు రుజువు చేస్తుంటాయి. ఒక చెట్టు కింద ఆడ కోలా చనిపోయి పడి ఉంది. దానిని అలా విగత జీవిగా చూసిన మగ కోలా తట్టుకోలేకపోయింది. దానిని దగ్గరకి తీసుకుని హత్తుకుని.. ఆకాశంవైపు చూస్తూ కన్నీరు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు మనసు చలించిపోయింది. వీడియో చూసి తట్టుకోలేకపోతున్నామని.. ప్రేమ, దయ ఇలాంటి జీవుల నుండి నేర్చుకోవాలని కామెంట్స్ చేసారు.

ఎద్దు కారణంగా ఆగిపోయిన మ్యాచ్.. అది గ్రౌండ్‌లోకి వచ్చి ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

నిజానికి ఆడ కోలా చనిపోయి ఉండటాన్ని గుర్తించిన స్ధానికులు సౌత్ ఆస్ట్రేలియన్ జంతు సంరక్షణ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన టీమ్ రెండు కోలాలను సంరక్షణలోకి తీసుకున్నారు. మగ కోలాకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అడవుల్లో వదిలిపెట్టారు. ఆడ కోలా అనారోగ్యంగా ఉన్నట్లు కానీ, శరీరంపై ఎటువంటి గాయాలు కానీ కనిపించలేదు.ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by KOALA RESCUE Inc ? (@koala_rescue)