పని తగ్గించి జీతం పెంచారు.. ఎల్ఐసీలో ఐదు రోజులే!

Lic
LIC staff: ప్రభుత్వరంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. మే 10వ తేదీ నుంచి కేవలం ఐదు రోజులే కార్యాలయాలు పనిచేస్తాయని ప్రకటించారు అధికారులు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే ఎల్ఐసీ ఆఫీసులు తెరిచి ఉంటాయని వెల్లడించారు అధికారులు.
నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ 1881 చట్టానికి సవరణ తీసుకువచ్చి శనివారాన్ని పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది కేంద్రం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న 1.14 లక్షల మంది ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతోంది.
ఎల్ఐసీ ఉద్యోగులకు జీతాల పెంపుపై కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 15-16 శాతం జీతాలు పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 20 శాతం వరకు కూడా పెంపు ఉండొచ్చునని సమాచారం.