SBI Jobs : డిగ్రీ పాస్ అయితే చాలు, ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, దరఖాస్తు వివరాలు

నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే రూ.41,960. Government Jobs

SBI Jobs : డిగ్రీ పాస్ అయితే చాలు, ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, దరఖాస్తు వివరాలు

SBI Jobs Qualifications (Photo : Google)

Updated On : September 28, 2023 / 6:50 PM IST

SBI Jobs Qualifications : మీరు డిగ్రీ పాస్ అయ్యారా? ప్రభుత్వ బ్యాంకులో జాబ్ లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఈ న్యూస్ మీ కోసమే. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఉద్యోగాల భర్తీకి కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2వేల ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

షెడ్యూల్ ప్రకారం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 27 చివరి తేదీ. అయితే నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే గడువును పొడిగించింది. అక్టోబర్ 3వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఇచ్చింది.

Also Read..Indian Army Recruitment : ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

అభ్యర్థులు 2023 డిసెంబర్ నాటికి డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. 21-30 ఏళ్లలోపు వయసు వారు అర్హులు. రిజర్వేషర్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలు ఉంటాయి. శాలరీ విషయానికి వస్తే బేసిక్ పే రూ.41,960. పూర్తి వివరాలకు వెబ్ సైట్..http://www.sbi.co.in/careers

ఎంపిక ప్రక్రియ..
ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్ సైజ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
దేశంలో ఎక్కడైనా పని చేయాలి.
అఫీషియల్ వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు రూ.750.
ఎస్టీ, ఎస్సీ, పీడబ్లుబీడీ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.
దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 3 2023.
కనీస వయసు 21ఏళ్లు.

Also Read..NF Railway Recruitment : ఈశాన్య సరిహద్దు రైల్వే గౌహతిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగ ఖాళీల భర్తీ