NF Railway Recruitment : ఈశాన్య సరిహద్దు రైల్వే గౌహతిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు ఫీజుగా రూ. 500, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్. సైనికులు, మహిళలు, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు రూ.250.గా నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NF Railway Recruitment : ఈశాన్య సరిహద్దు రైల్వే గౌహతిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగ ఖాళీల భర్తీ

NF Railway Recruitment

NF Railway Recruitment : నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే స్పోర్ట్స్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గువాహటి మాలిగావ్‌లోని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే వివిధ క్రీడాంశాల్లో స్పోర్ట్స్ పర్సన్ పోస్టుల నియామకాలను చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 51 పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Rabbit Farming : తక్కువ పెట్టుబడి… అధిక దిగుబడి.. ఉపాధిగా మారుతున్న కుందేళ్ల పెంపకం

ఖాళీల వివరాలకు సంబంధించి విలువిద్య (M/W) 03, , అథ్లెటిక్స్(M) 01, బాస్కెట్‌బాల్ (M/W) 07, టేబుల్ టెన్నిస్ (M/W) 06, వాలీబాల్ (M) 02, క్రికెట్ (M/W) 11, బాక్సింగ్ (M/W) 03, పవర్ లిఫ్టింగ్ (M/W) 03, ఫుట్‌బాల్ (M) 06, బ్యాడ్మింటన్ (M/W) 03, వెయిట్ లిఫ్టింగ్ (M/W) 02 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజేతలుగా నిలిచినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. ట్రయల్ ఆఫ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్, ఇంటర్వ్యూ, స్పోర్ట్స్ అచీవ్‌మెంట్, విద్యార్హతల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

READ ALSO : Pink Worm Prevention : పత్తికి గులాబి రంగు పురుగు బెడద.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

దరఖాస్తు ఫీజుగా రూ. 500, ఎస్సీ,ఎస్టీ,ఎక్స్. సైనికులు, మహిళలు, మైనారిటీలు మరియు ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు రూ.250.గా నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన చిరునామా ; సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (రిక్రూట్‌మెంట్), నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే హెచ్‌క్యూ, మాలిగావ్, గౌహతి – 781011.