Rabbit Farming : తక్కువ పెట్టుబడి… అధిక దిగుబడి.. ఉపాధిగా మారుతున్న కుందేళ్ల పెంపకం

ఆర్ధిక స్తోమతనుబట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి, తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం వుండేటట్లు చూసుకోవాలి. కుందేలు పుట్టిన ఐదు ఆరు నెలల వయస్సుకే సంతాన ఉత్పత్తి చేయాడానికి సిద్దంగా ఉంటాయి. కుందేళ్ల‌కు ప్ర‌త్యేకంగా గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యం అంటూ ఏమీ ఉండ‌దు.

Rabbit Farming : తక్కువ పెట్టుబడి… అధిక దిగుబడి.. ఉపాధిగా మారుతున్న కుందేళ్ల పెంపకం

Rabbit Farming

Rabbit Farming : కుందేళ్ల మాంసానికి మార్కెట్ గిరాకీ పెరుగుతుండంటకో చాలామంది యువత ఈ రంగంపై దృష్టిసారిస్తోంది. వ్యాపారసరళిలో ఈ పరిశ్రమను తీర్చిదిద్దుతూ ముందడుగు వేస్తున్నారు. మాంసోత్పత్తినిచ్చే మిగతా జీవాలతో పోలిస్తే కుందేళ్లలో సంతానవృద్ధి చాలా వేగంగా వుండటం, 5నెలలకే మార్కెట్ బరువుకు చేరుకోవటం వల్ల స్వల్పకాలంలో మంచి ఆదాయం పొందే వీలుంది.  ప్రత్యేకంగా షెడ్లు నిర్మించుకుని, మేత యాజమాన్యం, ఆరోగ్య సంరక్షణలో తగిన జాగ్రత్తలు పాటిస్తే రైతులు ఆశించిన ఫలితాలు పొందవచ్చని తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దివాకర్.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

వ్యవసాయ అనుబంధ రంగాల్లో చక్కటి ఉపాధిని అందించే పరిశ్రమ  కుందేళ్ల పెంపకం. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందినా, వీటి మాంసం వినియోగం తక్కువ వుండటంతో వృద్ధి అవకాశాలు సన్నగిల్లాయి. అయితే క్రమేపి పరిస్థితిలో మార్పు రావటంతో తిరిగి ఈ రంగ ఊపందుకుంటోంది. కుందేళ్లు సున్నితమైన జీవులు. అందువల్ల నిర్ధేశించిన వాతావరణ పరిస్థితుల మధ్య, ప్రత్యేకంగా షెడ్లు నిర్మించి జాగ్రత్తగా పెంచాల్సి వుంటుంది. ఇంటివద్ద  ఉండే చిన్న‌పాటి స్థ‌లంలో కూడా వీటిని పెంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

కూర‌గాయ‌లు, ఆకుకూరలు, గింజ‌లు, ల్యూసర్న్, హెడ్జ్ ల్యూసర్న్ వంటి గ్రాసాలను వీటికి మేతగా అందించవచ్చు. కొద్దిపాటి శ్రమతో, తక్కువ ఖర్చుతో  మంచి లాభాలను పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కుందేళ్ల మాంసానికి గిరాకీ ఎక్కువ ఉంది. డిమాండ్‌కు అనుగుణంగా పెంపకం చేపడితే ఆదాయమూ పెంచుకోవచ్చు. చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులు, మరే ఇతర రంగాలకు చెందిన వారైనా మొదట తక్కువ పెట్టుబడితో 10 జతలతో కుందేళ్ల పెంపకం ప్రారంభించి అనుభవం వచ్చాక,  షెడ్లను విస్తరించవచ్చు. ఇది రైతులకు అదనపు ఆదాయాన్నివ్వడమే గాక నిరుద్యోగులకు స్వయం ఉపాధినిస్తుంది.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

కుందేళ్ల పెంపకం.. గేదెలు, కోళ్ళ పోషణ కంటే సులభం. వీటిలో అనేక జాతులు వున్నప్పటికీ, అధిక మాంసోత్పత్తినిత్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.  మేలుజాతి లక్షణాలు కలిగి మనప్రాంతానికి అనువైన రకాలను ఎచుకుంటే మంచిది.  షెడ్ల ఏర్పాటు చేసుకుని కేజ్ విధానంలో వీటిని పెంచాలి.  ప్రతి ఆడ కుందేలుకు 5 చదరపు అడుగులు, మగ కుందేలుకు 2.5 చదరపు అడుగుల స్థలం వుండేటట్లు జాగ్రత్తవహించాలి. పిల్లలను బన్నీలు అంటారు. ఒక్కో బన్నీకు ఒక చదరపు అడుగు చొప్పున కేజ్ లు కేటాయించాలి. నీరు ఎల్లప్పుడు అందుబాటులో వుండేవిధంగా కేజ్ లలో నిపుల్స్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది.

ఆర్ధిక స్తోమతనుబట్టి షెడ్లను నిర్మాణం చేపట్టి, తూర్పు, పడమర దిశల్లో చల్లని వాతావరణం వుండేటట్లు చూసుకోవాలి. కుందేలు పుట్టిన ఐదు ఆరు నెలల వయస్సుకే సంతాన ఉత్పత్తి చేయాడానికి సిద్దంగా ఉంటాయి. కుందేళ్ల‌కు ప్ర‌త్యేకంగా గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యం అంటూ ఏమీ ఉండ‌దు. అవి ఒక‌దానితో ఒక‌టి జ‌ట్టు క‌ట్టిన స‌మ‌యాన్నే గర్భ‌ధార‌ణ స‌మ‌యంగా అనుకోవాలి. ఈ క్ర‌మంలో  5 నుంచి 6 నెలల్లో మొదటిసారిగా పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిస్తుంది. ఆ త‌రువాత 6 వారాల‌కు అవి మ‌ళ్లీ జ‌త క‌ట్టేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇక కుందేళ్ల‌కు 12 వారాల వ‌య‌స్సు వ‌స్తే వాటిని అమ్మ‌వచ్చు. అయితే అమ్మే స‌మ‌యంలో వాటి బ‌రువు కనీసం 2 కిలోలు ఉండేలా చూసుకుంటే మంచి లాభం వ‌స్తుంది. ఏడాదికి ఆరుసార్లు ఈనుతాయి. ఒక్కో ఆడకుందేలు ఏడాదికి 30 నుండి 40 పిల్లలకు జన్మనిస్తుంది.

READ ALSO : Intercrops In Palm Oil : పామాయిల్ లో అంతర పంటలుగా కోకో, మిరియాల సాగు

వేస‌వి, వ‌ర్షాకాలం ,శీతాకాలంలో వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా షెడ్డు ఉండాలి. గాలి, వెలుతురు పుష్కలంగా ఏర్పాటు చేసుకోవాలి . షెడ్లో ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఎండాకాలంలో అయితే షెడ్ పై వరిగడ్డి కప్పి, స్ర్పింకర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టు గోనెసంచులు కట్టాలి. షెడ్డులో మలమూత్రాలు రోజు కడిగివేయాలి, వారానికి ఒకసారైన ఫినాయిల్ తో షెడ్డు ఫ్లోరింగ్ శుభ్రం చేయాలి. కుందేళ్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. . ఎలాంటి వ్యాధులు సోకిన పశువైద్యులను సంప్రదించి మందుల‌ను వాడితే కుందేళ్ల ఆరోగ్యం బాగుంటుంది. త‌ద్వారా అవి ఎక్కువ బ‌రువు తూగి అమ్మ‌కాల్లో లాభాలు వ‌స్తాయి.

ప్రస్తుతకాలంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ప్రధాన ఆకర్షణగా మారాయి. పాడి పశువులు, గొర్రెలు, కోళ‌్ల పెంపకంతో పాటు కుందేళ్ల పెంపకంపై కూడా ఆసక్తి పెరుగుతోంది. మేకలు, కోళ్లకు ఉన్నంత మార్కెట్‌లేకపోయినా కొంతమంది ఔత్సాహకులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఈ కుందేళ్లను పెంచేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే పెంపకంలో మంచి యాజమాన్యం పద్ధతులు పాటిస్తే ఏడాది పొడవునా లాభాలు పొందవచ్చు. ముందుగా మార్కెటింగ్ అవకాశాలపై తగిన అవిగాహన ఏర్పరుచుకుని, పెంపకానికి ముందడుగు వేయాలి.