Indian Army Recruitment : ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Indian Army Recruitment : ఇండియన్ ఆర్మీలో 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

Indian Army Recruitment

Indian Army Recruitment : ఇండియన్ ఆర్మీ 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. TGC 139 కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు joinindianarmy.nic.in వద్ద ఇండియన్ ఆర్మీ అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2024లో ప్రారంభమయ్యే 139వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

READ ALSO : NF Railway Recruitment : ఈశాన్య సరిహద్దు రైల్వే గౌహతిలో స్పోర్ట్స్ కోటా ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం 30 ఖాళీలు ఉండవు. సివిల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ & టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. సివిల్: 07, కంప్యూటర్ సైన్స్: 07, ఎలక్ట్రికల్ : 03, ఎలక్ట్రానిక్స్: 04, మెకానికల్: 07, ఎంఐఎస్‌సీ ఇంజినీరింగ్ స్ట్రీమ్: 02 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : Rabbit Farming : తక్కువ పెట్టుబడి… అధిక దిగుబడి.. ఉపాధిగా మారుతున్న కుందేళ్ల పెంపకం

వయోపరిమితి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక అప్లికేషన్స్‌ షార్ట్‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అవివాహిత పురుషులు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 26 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://joinindianarmy.nic.in/ పరిశీలించగలరు.