Foreigners Stuck In India : విదేశీయుల వీసా గడువు పొడిగింపు
కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Govt Extends Visa Validity Of Foreigners Stuck In India Till August 31
Foreigners Stuck In India కరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై కేంద్రప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు విదేశీయులు భారత్‌లో చిక్కుకుపోయారు. భారత్‌లో చిక్కుకున్న విదేశీ పౌరులు తమ వీసా గడువును పొడిగించుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్రం ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం వారి వీసా గడువు పెంచుతూ నిర్ణయం తీసకుంది. దేశంలో చిక్కుకున్న విదేశీయుల వీసా గడువు ఆగస్ట్ 31, 2021 వరకు పొడిగిస్తూ కేంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎటువంటి ఓవర్‌స్టే పెనాల్టీ విధించకుండా ఉచిత ప్రాతిపదికన వీదేశీయుల వీసా గడువు పొడగించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో విదేశీ పౌరులు తమ వీసా గడువు పొడిగింపు కోసం సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ లేదా ఎఫ్‌ఆర్‌ఓకు ఎటువంటి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది.
విదేశీ పౌరులు దేశం నుంచి వెళ్లే ముందు సంబంధిత ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, ఎఫ్‌ఆర్‌ఓకు నిష్క్రమణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఓవర్‌స్టే జరిమానా విధించకుండా ఉచిత ప్రాతిపదికన మంజూరు చేయబడుతుంది అని కేంద్రం తెలిపింది.