Nazar Na Lage : వధువును చూసి ఆశ్చర్యపోయిన వరుడు..ఎందుకో

ఓ వీడియో అందర్నీ ఆకట్టుకొంటోంది. ఎందుకంటే..పెళ్లి మండపంలోకి వచ్చిన వధువును చూసిన వరుడు ఆశ్చర్యపోయిన విధానం అందర్నీ నవ్విస్తోంది.

Nazar Na Lage : వధువును చూసి ఆశ్చర్యపోయిన వరుడు..ఎందుకో

Bride

Updated On : September 13, 2021 / 8:48 PM IST

Groom’s Reaction : ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు యమ వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్య ‘బుల్లెట్ బండి’ అనే సాంగ్ కు నూతన వధువు వేసిన స్టెప్స్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. వధువు, వరుడు, ఇతర కుటుంబసభ్యులు చేసే డ్యాన్స్, వారికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా..మరొక వీడియో అందర్నీ ఆకట్టుకొంటోంది. ఎందుకంటే..పెళ్లి మండపంలోకి వచ్చిన వధువును చూసిన వరుడు ఆశ్చర్యపోయిన విధానం అందర్నీ నవ్విస్తోంది.

Read More : Man Cheated Girl : తనను వదిలేసి వెళ్లిన మొగుడ్ని చొక్కా పుచ్చుకు లాక్కెళ్ళిన భార్య

ఓ ప్రాంతంలో పెళ్లి జరుగుతోంది. పెళ్లి మండపానికి వధువును భుజాన ఎత్తుకుని వస్తున్నారు. అంతలో…వరుడికి కనిపించకుండా..అడ్డంగా ఓ బట్టను ఉంచారు. అనంతరం అడ్డుగా ఉంచిన బట్టను తొలగించారు. ఆ సమయంలో..వరుడు ఆశ్చర్యకరంగా ముఖం పెట్టాడు. అతని హావభావాలకు అందరూ నవ్వేసుకున్నారు. అక్కడున్న వారు భుజాన చేయి వేసి తట్టేసరికి…ఈ లోకానికి వచ్చాడు. ఈ సందర్భంగా వధువు చిరునవ్వులు చిందించింది. తర్వాత..ఆమెతో ఏడడుగులు నడిచాడు. వధువు నుదుటిపై తిలకం దిద్దాడు. shaadisaga ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది.

 

View this post on Instagram

 

A post shared by ShaadiSaga.com (@shaadisaga)