Karnataka: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. కేసీఆర్ సహా ఈ నేతలు మాత్రం…

కర్ణాటక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చెప్పారు.

Karnataka: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. కేసీఆర్ సహా ఈ నేతలు మాత్రం…

Karnataka

Updated On : May 19, 2023 / 5:47 PM IST

Karnataka swearing ceremony: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈ నెల 20న సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ (Congress) నేత కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఇప్పటికే అధికారికంగా ప్రకటించడంతో అందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ (DK Shivakumar), మంత్రులుగా మరో ఎనిమిది మంది ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే, ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చెప్పారు. దీని ద్వారా ప్రతిపక్షాల ఐక్యతతో పాటు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న పార్టీలను, దేశంలో తమ బలం ఎంతుందో కాంగ్రెస్ చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పలువురు కీలక నేతలను ఇందుకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.

అందులో ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. వీరిద్దరికి కాంగ్రెస్ ఆహ్వానం పంపలేదని సమాచారం. అలాగే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావట్లేదని తెలుస్తోంది. ఆమెకు ఆహ్వానం అందినప్పటికీ ఇతర ముఖ్యమైన పనులు ఉండడంతో ఆమె కర్ణాటకకు వెళ్లడం లేదు.

ఇక కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కి ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, రాజస్థాన్ సీఎం గహ్లోత్, బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్, పుదుచ్చేరి సీఎం రామస్వామి, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఈ కార్యక్రమానికి రానున్నారు.

Telangana Elections 2023: సెప్టెంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్.. ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఉత్తమ్