గౌహతి విమానాశ్రయంలో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

ఈ విమానాశ్రయం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికీ చెందిన కంపెనీ ఆధ్వర్యంలోjకొనసాగుతుంది. విమానాశ్రయంలోని కొంతభాగం పైకప్పు కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గౌహతి విమానాశ్రయంలో ప్రయాణికులకు తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్

Gopinath Bordoloi Airport

Updated On : April 1, 2024 / 10:58 AM IST

Guwahati Airport : అస్సాంలోని గౌహతి విమానాశ్రయంలో ప్రయాణికులకు తృటిలో ప్రమాదం తప్పింది. గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగా విమానాశ్రయం పైకప్పు కొంతభాగం ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో పైకప్పు కొంతభాగం కూలిపోతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. బలమైన తుఫాను కారణంగా టెర్మినల్ వెలుపల పైకప్పు భాగం ఎగిరిపోయిందని చెప్పారు.

Also Read : ప‌తిర‌న‌ సూపర్ క్యాచ్.. వార్న‌ర్‌కు దిమ్మతిరిగిపోయింది.. వీడియో వైరల్

చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఏఓ) ఉత్పల్ బురుహ్ ఈ ఘటనపై మాట్లాడుతూ.. ఈదురు గాలులకు రోడ్డుపక్కన ఉన్న ఆయిల్ ఇండియా కాంప్లెక్స్ వద్ద పెద్ద చెట్టు నేలకూలిందని, దీని తాకిడికి విమానాశ్రయం పైకప్పు భాగం కూలిపోయిందని అన్నారు. పగిలిన భాగం ద్వారా వర్షం నీరు కూడా విమానాశ్రయంలోకి ప్రవేశిచిందని, అయితే, ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. స్వయంగా నేను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నానని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలను దారి మళ్లించామని, ఇప్పటి వరకు ఆరు విమానాలను దారి మళ్లించడం జరిగిందని చెప్పారు.

Also Read : Congress Party : తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్‎లను నియమించిన కాంగ్రెస్ పార్టీ

ఇదిలాఉంటే ఈ విమానాశ్రయం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికీ చెందిన కంపెనీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. పైకప్పు కూలిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.