Congress Party : తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్‎లను నియమించిన కాంగ్రెస్ పార్టీ

తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను ఇంచార్జులుగా నియమిస్తూ..

Congress Party : తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్‎లను నియమించిన కాంగ్రెస్ పార్టీ

Congress Party

Lok Sabha Election 2024 : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. మరో నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సోమవారం జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మిగిలిన నాలుగు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 నుంచి 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా నియోకవర్గాల వారిగా ఇన్ చార్జిలను నియమించింది.

Also Read : Mlc Kavitha Bail Petition : బెయిల్ వచ్చేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ

 • పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలను ఇంచార్జులుగా నియమిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
  నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
  ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
  పెద్దపల్లి – దుద్దిళ్ల శ్రీదర్ బాబు
  జహీరాబాద్ – దామోదర్ రాజనర్సింహ
  మహబూబాబాద్ – తుమ్మల నాగేశ్వరరావు
  నాగర్ కర్నూల్ – జూపల్లి కృష్ణారావు
  సికింద్రాబాద్ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  మెదక్ – కొండా సురేఖ
  అదిలాబాద్ – సీతక్క
  భువనగిరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  వరంగల్ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
  నిజామాబాద్ – సుదర్శన్ రెడ్డి
  మహబూబ్ నగర్ – సంపత్ కుమార్
  మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు
  చేవెళ్ల – వేం నరేందర్ రెడ్డి
  హైదరాబాద్ – ఒబేదుల్లా కొత్వాల్

Also Read : అప్పట్లో కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లలేదు.. ఇప్పుడు వెళ్తున్నారు: మహేశ్ కుమార్ గౌడ్