Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..అతి వేగానికి 8 మంది బలి

హర్యానాలో జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 8మంది ప్రాణాలు కోల్పోయారు. అతి వేగానికి ఎనిమిదిమంది ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..అతి వేగానికి 8 మంది బలి

Accident In Haryana

Updated On : October 22, 2021 / 12:08 PM IST

Road Accident : హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. హర్యానా బహదూర్ గఢ్ లోని బద్లి పట్టణం సమీపంలో శుక్రవారం (అక్టోబర్ 22,2021) ఉదయం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగివున్న లారీని ఎర్టిగా వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా ఎర్టిగా వాహనంలో వెళ్తున్నట్లుగా తెలిసింది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బహదూర్‌గఢ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనాలు అజాగ్రత్తగా, మద్యం సేవించి నడపడం, ఓవర్‌టెక్‌ చేయడం తదితర కారణాల వల్ల ప్రతి రోజు దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నా.. జరుగుతూనే ఉన్నాయి.

అతి వేగం..నిర్లపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు పడటం వంటి పలు కారణాలు ఎన్నో ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్నాయి. మరెంతోమందిని అంగవైకల్యంతో బాధపడేలా చేస్తున్నాయి.