Odisha Train Accident: విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామా కోరుతుంటే శభాష్ అంటూ సపోర్ట్ చేసిన మాజీ ప్రధాని
ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సిందంతా చేశారు. ఆయన అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను కూడా చూశాను. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ముందు దర్యాప్తు పూర్తికానివ్వండి.

HD Deve Gowda
HD Deve Gowda: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విణీ వైష్ణవ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. బీజేపీకి చాలా కాలంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్న జేడీఎస్ (జనతాదశ్ సెక్యూలర్) మాత్రం మద్దతుగా నిలిచింది. ఆ పార్టీ చీఫ్, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ తాజా స్పందిస్తూ రైల్వే ప్రమాదం అనంతరం రైల్వే మంత్రి బాగా పని చేశారని, ప్రమాదం జరిగినప్పటి నుంచి రైల్వే మంత్రి అక్కడే ఉండి అవిశ్రాంతంగా కష్టపడ్డారని ప్రశంసించారు. ఇక ఇలాంటి సమయంలో విపక్షాల డిమాండ్ తెలివైన పని కాదని ఆయన చురక అంటించారు.
Karnataka Politics: ఆవుల్ని వధిస్తే తప్పేంటన్న కర్ణాటక మంత్రి.. సీఎం సిద్ధరామయ్య రియాక్షన్ ఏంటంటే?
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ”ప్రమాదం తరువాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వే మంత్రి చేయాల్సిందంతా చేశారు. ఆయన అవిశ్రాంతంగా కష్టపడ్డారు. 55 గంటలుగా ఆయన శ్రమించడం నేను కూడా చూశాను. రైల్వే మంత్రిగా ఆయన ఎంతవరకూ చేయగలరో అంతా చేశారు. ముందు దర్యాప్తు పూర్తికానివ్వండి. ఇలాంటి సమయంలో ఆయనను రాజీనామా చేయమంటూ డిమాండ్ చేయడం ఏమాత్రం తెలివైన పని కాదు” అని దేవెగౌడ అన్నారు.
ఇక సీబీఐ దర్యాప్తుపై ప్రశ్నించగా.. దానిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదని సమాధానం ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు ఒక స్టాండ్ తీసుకున్నారని, అయితే దీని వెనుక రాజకీయంగా దాడి చేసే ఉద్దేశాలు ఉండకూడదన్నదే తన అభిప్రాయమని మాజీ ప్రధాని దేవెగౌడ చెప్పారు.