Maharashtra Politics: మహారాష్ట్రలో డేర్ చేసిన కాంగ్రెస్.. గతంలో గెలిచింది ఒక్కటే, కానీ ఈసారి 20 కావాలట

2019 లోక్‭సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఇక పోతే ఎంవీఏ కూటమిలో ఉన్న శివసేన (యూబీటీ) 18 స్థానాల్లో గెలిచింది

Maharashtra Politics: మహారాష్ట్రలో డేర్ చేసిన కాంగ్రెస్.. గతంలో గెలిచింది ఒక్కటే, కానీ ఈసారి 20 కావాలట

MVA Seat Sharing: ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి దేశంలో చాలా చోట్ల రాజీపర్వం కొనసాగుతోంది. పార్టీకి పెద్దగా ఆదరణ లేకపోవడం వల్ల చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తోంది. మహారాష్ట్రలో కూడా ఆ పార్టీకి దాదాపుగా అలాంటి పరిస్థితే వచ్చింది. గత లోక్‭సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో నాలుగో స్థానానికి పడిపోయింది. 48 లోక్‭సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒకే స్థానంలో గెలిచింది. ప్రస్తుతం ఎన్సీపీ, శివసేన (యూబీటీ) పార్టీలతో కలిసి మహా వికాస్ అగాఢీ పొత్తులో ఉన్న కాంగ్రెస్.. రాజీ మార్గాన్ని దాటి ఇరు పార్టీలను డిమాండ్ చేయడానికి ప్రయత్నిస్తోంది.

Gujarat: క్రికెట్ ఆడుతుండగా బంతి తీసుకున్నాడని దళిత వ్యక్తి బొటనవేలు నరికారు

40 లోక్‭సభ స్థానాల్లో సర్వే చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి 20 కి పైగా స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో అచంచల విశ్వాసం పెరిగిందని, నియోజకవర్గాల్లో సంస్థాగతంగా బలంగా ఉన్నామని మహా కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అంటున్నారు. మహా వికాస్ అగాఢీ సమావేశంలో ఇదే విషయాన్ని చెబుతామని ఆయన అంటున్నారు. ఇక ఇదే సమయంలో నానా పటోలే పనితీరుపై సొంత పార్టీ నుంచే ప్రశ్నలు లేస్తున్నాయి. ఇలాంటి సమయంలో మిత్ర పార్టీలను ఆయన ఛాలెంజ్ చేస్తుండడం గమనార్హం.

Odisha train accident: గాలిలో దీపంలా రైల్వే ప్రయాణికుల భద్రత.. ఒడిశా ప్రమాదంతో వెలుగుచూస్తున్న లోపాలు

2019 లోక్‭సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఇక పోతే ఎంవీఏ కూటమిలో ఉన్న శివసేన (యూబీటీ) 18 స్థానాల్లో గెలిచింది. ఇక అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 56 స్థానాలు గెలుచుకుంది, ఎన్సీపీ 54 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకుంది. ఏ విధంగా చూసినా ఎన్సీపీ, శివసేనల కంటే కాంగ్రెస్ చాలా వెనుకబడి ఉంది. కానీ 20కి పైగా సీట్లు ఆశించడం మాత్రం డేర్ చేయడమే అంటున్నారు.