ఒవైసీ టార్గెట్: యోగి అదృష్టంతో సీఎం అయ్యాడు

ఒవైసీ టార్గెట్: యోగి అదృష్టంతో సీఎం అయ్యాడు

Updated On : September 28, 2019 / 2:13 PM IST

AIMIM ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తిట్టిపోశాడు. శనివారం భారత సంపదను మొగళ్లు, బ్రిటీషులు కొల్లగొట్టారని వాళ్లే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించాడు యోగి ఆదిత్య నాథ్. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ.. ఉత్తరప్రదేశ్ సీఎం మరోసారి తనకు తెలివిలేదని నిరూపించుకున్నాడని అన్నారు. 

‘అతనొక నిపుణుడిని కలవాలి. ఏదో అదృష్టవశాత్తు సీఎం అయిపోయాడు. నేనొక పాయింట్ అడుగుతున్నా. ఈ ఆరేళ్లలో బీజేపీ ఏం చేసింది. నిరుద్యోగం మాటేంటి.  5శాతం జీడీపీ సంగతేంటి’ అని ప్రశ్నించారు. ముంబైలో జరిగిన వరల్డ్ హిందూ ఎకానమీ ఫారమ్‌లో పాల్గొన్న యోగి భారత ఆర్థిక వ్యవస్థ గురించి వ్యాఖ్యలు చేశారు. 

ఈ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి భారత్ ఆర్థిక వ్యవస్థలో ఓ పవర్ హౌజ్ లా ఉండేదని, మొగళ్లు, బ్రిటీషర్లు దాడి చేసిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని చెప్పుకొచ్చారు. బ్రిటీష్ రూల్స్‌ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు మిలియన్ల మంది భారత ప్రాణాలు, ఆహార సంపద అంతా నాశనమైపోయింది. అమెరికన్ చరిత్రకారుడు రాసిన ద కేస్ ఫర్ ఇండియా పుస్తకంలో భారత్ నుంచి బ్రిటన్ దోచుకుంది చరిత్రలోనే పెద్ద నేరంగా అభివర్ణించారు.