Karnataka Hijab : హైకోర్టులో హిజాబ్ వివాదం..విచారణ డివిజన్ బెంచ్ కు బదిలీ

కర్ణాటక హైకోర్టులో హిజాబ్ వివాదం విచారణను డివిజన్ బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు తెలిపింది.

Karnataka Hijab : హైకోర్టులో హిజాబ్ వివాదం..విచారణ డివిజన్ బెంచ్ కు బదిలీ

Karnataka High Court Transfer Hijab Case To Division Bench

Updated On : February 9, 2022 / 6:08 PM IST

Karnataka High Court transfer Hijab case to division bench : కర్ణాటకలో కాలేజీ విద్యార్ధినిలు హిజాబ్ (బుర్ఖా) ధరించి రావటంపై తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలసిందే. ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ హిజాబ్ వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారుతున్న క్రమంలో పలువురు ప్రముఖులు దీన్ని ఖండిస్తున్నారు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ముసుగు వివాదంకాస్తా విద్యార్ధులు చీలిపోయేలా…రెండు వర్గాలుగా మారిపోయేలా చేసింది. హిజాబ్ ధరించి వచ్చిన తమను విద్యాసంస్థ యాజమాన్యం అనుమతించకపోవడం పట్ల ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కర్ణాటక హైకోర్టు గత రెండ్రోజులుగా విచారణ జరిపిన సింగిల్ బెంచ్… ఈ అంశాన్ని డివిజన్ బెంచ్ కు బదిలీ చేస్తున్నట్టు తెలిపింది.

Also read : Priyanka Gandhi Hijab : బికినీ అయినా, జీన్స్,బుర్ఖా ఏదైనా ధరించే హక్కు మహిళలకు ఉంది

వాదనల్లో భాగంగా విద్యార్థుల విశ్వాసాలను విద్యాసంస్థల యాజమాన్యాలు గౌరవించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది స్పందిస్తూ, విద్యార్థులందరూ ఒకే డ్రెస్ కోడ్ పాటించాలని..కొంతమంది ఒకలాగా మరికొంతమంది మరోలా డ్రెస్ వేసుకుని వస్తే విద్యార్ధుల్లో సమానత్వం ఉండదని స్పష్టం చేసింది. వాదోపవాదాలను విన్న ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఈ కేసును రేపటి నుంచి డివిజన్ బెంచ్ విచారణ జరుపుతుందని ప్రకటించింది.

కాగా..విద్యాసంస్థల్లో హిజాబ్ వివాదం తీవ్ర నిరసన జ్వాలలకు కారణమవుతోంది. ఎన్ని వ్యతిరేకతలు వచ్చిన కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఏంమాత్రం తగ్గటంలేదు. ముస్లిం విద్యార్ధినిలు యూనిఫాం వేసుకుని రావాల్సిందేనని చెబుతోంది. దీనిపై నిరసన తెలుపుతున్న విద్యార్ధినుల ఆందోళనలపై నిషేధం విధించింది. బెంగళూరు నగర వ్యాప్తంగా విద్యాసంస్థల గేట్లకు 200 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు, గుమికూడడం వంటివి చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

Also read : Karnataka Hijab: మ‌హిళ‌ల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు : బీజేపీ ఎమ్మెల్యే

ఈ వివాదంతో కర్ణాటకలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ నేడు పలు విద్యాసంస్థల వద్ద విద్యార్థులు హిజాబ్ లు చేస్తుంటే మరోపక్క కొంతమంది విద్యార్ధులు కాషాయ కండువాలు ధరించి పోటాపోటీ ప్రదర్శనలు నిర్వహించారు. ఇలా ఓ వైపు బుర్ఖా, మరోవైపు కాషాయ కండువాల నిరసనలు విద్యార్ధులను చదువులకు దూరం చేస్తున్నాయి.

Also read : Hijab Row: ‘హిజాబ్‌కు లేదా కాషాయానికి ప్రభుత్వం దేనికీ సపోర్ట్ కాదు’

మొన్న మొన్నటి వరకు కోవిడ్ వల్ల కాలేజీలు తెరవనేలేదు. ఇటీవలకాలంలో క్లాసులు కొనసాగుతున్న క్రమంలో ఈ బుర్ఖాల వివాదంతో క్లాసులు జరగక..వివాదాలతో విద్యాసంస్థలు మూతపడిన పరిస్థితి నెలకొంది.