Himachal Pradesh: సీఎం కుర్చీ దక్కలేదు, మంత్రి పదవి కూడా హుళక్కేనా?.. గృహ హింస కేసులో పీసీసీ చీఫ్, ఆమె కుమారుడు

కొద్ది రోజుల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవికి ప్రతిభా సింగ్ పోటీ పడ్డారు. కానీ సుఖ్వీందర్ సింగ్ సుఖుకి ఆ పదవి దక్కడంతో, కనీసం కొడుక్కైనా మంత్రి పదవి దక్కాలని ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమెకు సీఎం పదవి ఇవ్వనందుకు విక్రమాదిత్యకైనా మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది

Himachal Pradesh: సీఎం కుర్చీ దక్కలేదు, మంత్రి పదవి కూడా హుళక్కేనా?.. గృహ హింస కేసులో పీసీసీ చీఫ్, ఆమె కుమారుడు

Himachal Congress chief, MLA’s son summoned in domestic violence case

Updated On : December 16, 2022 / 5:00 PM IST

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ సహా ఆమె కుమారుడు, ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ చిక్కుల్లో పడ్డారు. గృహ హింసకు పాల్పడ్డట్లు వీరిపై కేసు నమోదైంది. విక్రమాదిత్య సింగ్ మాజీ భార్య సుదర్శన్ సింగ్ ఛుండావత్ వేసిన కేసులో వీరిద్దరికీ కోర్టు సమన్లు పంపింది. భర్త, అత్త, వదిన, బావ కలిసి తనపై విధింసులకు పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుదర్శన్ సింగ్ ఛుండావత్ ఆరోపించారు. ఈ విషయమై తొందర్లోనే ప్రతిభా సింగ్, విక్రమాదిత్య సింగ్‭లు వ్యక్తిగతంగా కోర్టు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

Russia: యుక్రెయిన్‌పై మళ్లీ మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న రష్యా.. మూడు నగరాలపై దాడులు

కొద్ది రోజుల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవికి ప్రతిభా సింగ్ పోటీ పడ్డారు. కానీ సుఖ్వీందర్ సింగ్ సుఖుకి ఆ పదవి దక్కడంతో, కనీసం కొడుక్కైనా మంత్రి పదవి దక్కాలని ఆమె ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమెకు సీఎం పదవి ఇవ్వనందుకు విక్రమాదిత్యకైనా మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే తాజాగా వీరిద్దరిపై కేసు నమోదు కావడంతో కథ అడ్డం తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసు కనుక కాస్త సీరియస్ అయితే విక్రమాదిత్యకు మంత్రి పదవి హుళక్కే అని అంటున్నారు విశ్లేషకులు.

Rahul Gandhi Bhart Jodo Yatra: 100 రోజులకు చేరిన భారత్ జోడో యాత్ర.. రాజస్థాన్‌లో ఉత్సాహంగా ముందుకు..

ఛుండావత్‌కు విక్రమాదిత్యకు 2019 మార్చిలో వివాహం జరిగింది. అయితే తండ్రి వీరభద్ర సింగ్ మరణాంతరం తనను పుట్టింటికి పొమ్మని విక్రమాదిత్య బలవంతం చేశాడని, తన నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని ఛుండావత్ ఆరోపించారు. గృహ హింస కేసులో నాన్‌-బెయిలబుల్ వారెంట్లు జారీ అయినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. దీనిపై విక్రమాదిత్య స్పందిస్తూ.. తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి నాన్‌-బెయిలబుల్ వారెంట్లు జారీ కాలేదని వివరణ ఇచ్చారు.