CORDYCEPS : ఔషధాల గని ‘కార్డిసెప్స్ పుట్టగొడుగులు’.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్

హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే కార్డిసెప్స్ పుట్టగొడుగులకు అంతర్జాతీయంగా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. క్యాన్సర్ తో పాటు పలు రోగాలను నియంత్రించే ఔషధాలు ఈ కార్బిసెప్స్ లో ఉన్నాయని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఈ కార్డిసెప్స్ పుట్టగొడుగులను కీడా జాడీలు అని కూడా అంటారు. వీటి కోసమే చైనా అంతగా ఆశపడుతోంది. చైనా భూభాగంలోని హిమాలాయల్లో వీటి లభ్యత తగ్గిపోయింది. అందుకే భారత్ భూభాగంలోని హిమాలయాల్లో లభ్యమయ్యే ఈ కార్డిసెప్స్ పుట్టగొడుగులపై కన్నేసింది. కార్డిసెప్స్ పుట్టగొడుగుల్లో దివ్య ఔషధాలున్నాయి. ఈ ఔషధాలు ఎన్నో రోగాలను నయం చేస్తాయని నమ్మకం ఉంది.

CORDYCEPS : ఔషధాల గని ‘కార్డిసెప్స్ పుట్టగొడుగులు’.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఫుల్ డిమాండ్

'Himalayan Viagra' CORDYCEPS (2)

Updated On : December 27, 2022 / 2:01 PM IST

CORDYCEPS : హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే కార్డిసెప్స్ పుట్టగొడుగులకు అంతర్జాతీయంగా మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. క్యాన్సర్ తో పాటు పలు రోగాలను నియంత్రించే ఔషధాలు ఈ కార్బిసెప్స్ లో ఉన్నాయని సైంటిస్టులు కూడా చెబుతున్నారు. ఈ కార్డిసెప్స్ పుట్టగొడుగులను కీడా జాడీలు అని కూడా అంటారు. వీటి కోసమే చైనా అంతగా ఆశపడుతోంది. చైనా భూభాగంలోని హిమాలాయల్లో వీటి లభ్యత తగ్గిపోయింది. అందుకే భారత్ భూభాగంలోని హిమాలయాల్లో లభ్యమయ్యే ఈ కార్డిసెప్స్ పుట్టగొడుగులపై కన్నేసింది. కార్డిసెప్స్ పుట్టగొడుగుల్లో దివ్య ఔషధాలున్నాయి. ఈ ఔషధాలు ఏ వ్యాధులను తగ్గిస్తాయ్? అంతర్జాతీయంగా.. ఇంతలా డిమాండ్ పెరగడానికి కారణాలేంటి? భారత్ వైపు ఉన్న హిమాలయ ప్రాంతాలపై.. చైనా ఎందుకు ఫోకస్ పెట్టింది? సరిహద్దులను దాటొచ్చి.. భారత సేనలను భయపెట్టి మరీ.. చైనా ఎందుకు పర్వత ప్రాంతాలపై పట్టు సాధించాలనుకుంటోంది?

కార్డిసెప్స్ పుట్టగొడుగులకు పెరిగిన డిమాండ్..
కార్డిసెప్స్ పుట్టగొడుగులు.. మంచి ఆహారంగా ప్రసిద్ధి చెందాయ్. ఇవి.. హానికారక కీటకాలను నాశనం చేస్తాయ్. అంటే.. మాంసంలో చనిపోయిన కీటకాల స్థానంలో కార్డిసెప్స్ ఫంగస్ డెవలప్ అవుతుంది. ఈ కీడా జాడీల్లోని కార్డిసెపిన్ అనే బయో యాక్టివ్ మాలిక్యూల్ గొప్ప చికిత్సా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అది.. ఏదో ఒక రోజు కొత్త యాంటీ వైరల్, యాంటీ క్యాన్సర్ చికిత్సగా మారుతుందని.. నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ.. క్యాన్సర్‌ను నియంత్రించే గుణాలు, నపుంసకత్వాన్ని పోగొట్టే లక్షణం, కిడ్నీ సమస్యలను నయం చేసే కారకాలు.. కీడా జాడీల్లో ఉన్నాయని.. రోగాలను తగ్గించే దివ్య ఔషధంగా ఇవి పనిచేస్తాయని చైనా ప్రజలు నమ్ముతున్నారు. దీంతో.. పదేళ్లుగా వీటికి బాగా డిమాండ్ పెరిగింది.

‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

పోషకాల గని కార్డిసెప్స్ పుట్టగొడుగులు..
అంతేకాదు.. ఈ కీడా జాడీలను హిమాలయన్ వయగ్రా అని కూడా పిలుస్తారు. కేవలం నపుంసకత్వ సమస్యలను దూరం చేయడమే కాదు.. క్యాన్సర్, ఆస్తమా, డయాబెటిస్, కామెర్లను కూడా తగ్గిస్తుంది. అందుకే.. వీటిని ఎక్కువగా ఔషధాల తయారీలో వాడుతున్నారు. కొందరతై.. వీటిని నేరుగా టీ, సూప్స్‌లో కలుపుకొని తాగేస్తుంటారు. కార్డిసెప్స్‌లో ఉండే శక్తిమంతమైన ఔషధ గుణాలు.. మరే పదార్థంలోనూ ఉండవు. యాంటీ మైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ఫైబ్రోటిక్, యాంటీ హెచ్ఐవీ, యాంటీ మలేరియా, యాంటీ డిప్రెషన్, యాంటీ ఆస్టియోపోరోసిస్.. ఇలా లెక్కలేనని గుణాలు వీటిలో ఉన్నాయి. అలాగే.. ప్రొటీన్లు, అమినో ఆమ్లాలు, విటమిన్ బి1, బి2, బి12 లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎన్నో రకాల జబ్బులను రాకుండా అడ్డుకోగలవు. వ్యాధులు వచ్చినా.. వాటితో పోరాడే శక్తిని.. శరీరానికి ఇస్తాయి. ఇన్ని రకాల ఔషధ గుణాలున్నాయి కాబట్టే.. బంగారం కంటే ఎక్కువ విలువైనవిగా మారాయి. అందుకే.. చైనా సేనలు వాటికోసం చొరబాట్లకు పాల్పడుతున్నారనే చర్చ జరుగుతోంది.

ఈ కీడా జాడీలు.. ఆల్పైన్ గడ్డి, పర్వత ప్రాంతాల్లో పెరగడానికి అయిదేళ్ల సమయం పడుతుంది. ఇవి లార్వా దశలో ఉన్నప్పుడు.. నేలపై పాకే సమయంలో వీటిపై ఫంగస్ అటాక్ చేస్తుంది. అప్పుడే.. ఆ గొంగళి పురుగులోని కణాలను తన కణాలతో భర్తీ చేస్తుంది. దాంతో.. భూమిలోకి కూరుకుపోయి చనిపోతాయ్. తర్వాత.. 5 నుంచి 15 సెంటీమీటర్ల పొడవున్న స్తంభాల్లా.. పుట్టగొడుగు ఆకారంలో పెరుగుతాయ్. ఇవి.. ఎక్కడ పడితే అక్కడ పెరగవు. సముద్రమట్టానికి సుమారు 3 నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో.. అతి శీతలమైన గడ్డి ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయ్. వీటిని సేకరించడం అంత ఈజీ కాదు. ప్రాణాలకు తెగించి.. విపరీతమైన వాతావరణ పరిస్థితుల్లో.. ఎత్తయిన పర్వతాలపై వీటిని వెతికి పట్టుకోవాలి.

CORDYCEPS : హిమాలయన్ గోల్డ్.. ‘కార్డిసెప్స్’ మార్కెట్ విలువ రూ. 9,000 కోట్లు…వాటి కోసమే భారత్‌పై చైనా కన్ను

హిమాలయాల్లో మాత్రమే.. లభ్యమయ్యే కార్డిసెప్ప్ పుట్టగొడుగులు
కేవలం.. భారత్, నేపాల్, భూటాన్, టిబెట్‌లో విస్తరించి ఉన్న హిమాలయాల్లో మాత్రమే.. ఈ కార్డిసెప్స్ దొరుకుతాయ్. అందుకే.. వీటిని హిమాలయన్ గోల్డ్ అని పిలుస్తారు. మే, జూన్‌లో మాత్రమే వీటిని సేకరిస్తారు. విదేశాల్లో వీటికి మామూలు డిమాండ్ లేదు. థాయ్‌లాండ్, మయన్మార్, ఇంగ్లండ్, అమెరికా, సింగపూర్, చైనా, జపాన్, కొరియా లాంటి దేశాలకు.. వీటిని ఎగుమతి చేస్తోంది చైనా. కానీ.. గత రెండేళ్లుగా వీటి సాగు తగ్గిపోయింది. ఇదే సమయంలో.. డిమాండ్‌తో పాటు రేటు కూడా పెరిగిపోయింది. ఇప్పుడు.. ప్రపంచంలోనే అత్యం విలువైన జీవ పదార్థాల్లో ఒకటిగా.. కీడా జాడీలు గుర్తింపు పొందాయ్.

చైనాలో దగ్గిన కార్డిసెప్స్ లభ్యత..అందుకే భారత్ పై కన్నేసిన చైనా
కేవలం.. హిమాలయా ప్రాంతాల్లో దొరికే ఈ కార్డిసెప్స్.. ల్యాబ్‌లో పెరగడం చాలా కష్టం. పెరిగినా.. నాణ్యమైనవి తయారయ్యే చాన్స్ లేదు. దీనికోసం.. శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ.. చుంగ్‌బుక్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మి కియోంగ్ లీ, డాక్టర్ ఐమన్ టర్క్ బృందం.. ఈ కీడా జాడీలను నియంత్రిత వాతావరణంలో.. వాటి పొటెన్సీ కోల్పోకుండా పెంచేందుకు ఒక మార్గాన్ని కనుగొన్నారు. వాటికి సంబంధించిన ఫలితాలను.. ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురించారు. కార్డిసెప్స్‌లో ఉన్న తిరుగులేని ఔషధ గుణాలు, వాటికున్న డిమాండ్ కారణంగానే.. చైనా సేనలు.. భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నిస్తున్నాయన్న న్యూస్.. ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్‌గా మారింది. చైనా వైపు ఉన్న పర్వత ప్రాంతాల్లో.. ఇప్పటికే కీడా జాడీల దిగుబడి బాగా తగ్గిపోయింది. అందుకే.. ఇప్పుడు భారత్ వైపు ప్రాంతాలపై పట్టు సాధిస్తే.. వాటిని చాలా సులువుగా సేకరించొచ్చని చైనా ప్లాన్ వేసింది.

Cordyceps: కార్డిసెప్స్ ఫంగస్ కోసమే భారత్ భూభాగంలోకి చైనా సైన్యం.. వాటి ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..