Bharat Jodo Yatra: పంజాబ్‭ చేరిన రాహుల్‭కు చుక్కెదురు.. సిక్కుల ఊచకోతను మరోసారి తెరపైకి లేపిన శిరోమణి

ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్భంలో ఈ విషయమై రాజీవ్ గాంధీని (అప్పుడు ఆయన ప్రధానమంత్రి) ప్రశ్నించగా.. ‘‘మహావృక్షం కూలినప్పుడు భూమి కొంత కంపిస్తుంది’’ అంటూ వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహ జ్వాలల్ని రేకెత్తించింది.

Bharat Jodo Yatra: పంజాబ్‭ చేరిన రాహుల్‭కు చుక్కెదురు.. సిక్కుల ఊచకోతను మరోసారి తెరపైకి లేపిన శిరోమణి

His father caused 1984 genocide of Sikhs: SAD targets Rahul on Golden Temple visit

Updated On : January 10, 2023 / 9:07 PM IST

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో భాగంగా పంజాబ్ చేరుకున్న రాహుల్ గాంధీకి.. మొదటి సారి భారతీయ జనతా పార్టీ కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పుమన్నాయి. ఈ విమర్శలు చేసింది పంజాబ్ స్థానిక పార్టీ శిరోమణి అకాలీ దళ్. ఇప్పటి వరకు బీజేపీ మినహా మరే పార్టీ రాహుల్‭పై కానీ, ఆయన యాత్రపై కానీ విమర్శలు చేయలేదు. బహుశా.. పంజాబ్ ప్రవేశం సందర్భంగా కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ విమర్శల్ని ఊహించి ఉండదు.

Afghanistan: యూనివర్సిటీల్లో అమ్మాయిల నిషేధంపై కీలక ప్రకటన చేసిన తాలిబన్

ఇందిరా గాంధీ మరణం అనంతరం దేశ వ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ఆ సమయంలో రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అయితే ఇందిరా మరణానికి ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీనే ఈ పని చేయిందనే విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు ఓ సందర్భంలో ఈ విషయమై రాజీవ్ గాంధీని (అప్పుడు ఆయన ప్రధానమంత్రి) ప్రశ్నించగా.. ‘‘మహావృక్షం కూలినప్పుడు భూమి కొంత కంపిస్తుంది’’ అంటూ వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహ జ్వాలల్ని రేకెత్తించింది.

Jammu and Kashmir: అందుకే జమ్మూ కశ్మీర్ ఎన్నికలు నిర్వహించడం లేదు.. కేంద్రంపై ఒమర్ అబ్దుల్లా ఫైర్

అదే విషయాన్ని తాజాగా శిరోమణి అకాలీ దళ్ అధినేత సుఖ్వీందర్ సింగ్ బాదల్ ప్రస్తావించారు. పంజాబ్‭ను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసినంతగా మరే పార్టీ ధ్వంసం చేయలేదని, పంజాబీలకు కాంగ్రెస్ శత్రువని అన్నారు. అలాగే రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని సైతం ప్రస్తావిస్తూ అంత మంది మరణాన్ని భూమి కంపించడంతో పోల్చి సిక్కుల్ని మానసికంగా ఊచకోత కోశారని బాదల్ విమర్శించారు.