Amit Shah: ఇండో-పాక్ సరిహద్దులో నడబెట్ వద్ద వీక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

పంజాబ్ లోని వాఘా-అటారి సరిహద్దు తరహాలో గుజరాత్లోని బనస్కాంత జిల్లాలోని నాడా బెట్లో ఇండో-పాక్ సరిహద్దు వ్యూయింగ్ పాయింట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.

Amit Shah: ఇండో-పాక్ సరిహద్దులో నడబెట్ వద్ద వీక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Nadabet

Updated On : April 10, 2022 / 1:47 PM IST

Amit Shah: గుజరాత్లోని బనస్కాంత జిల్లాలోని నాడా బెట్లో ఇండో-పాక్ సరిహద్దు వ్యూయింగ్ పాయింట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. పంజాబ్ లోని వాఘా-అటారి సరిహద్దు తరహాలో వ్యూయింగ్ పాయింట్ ను ఇక్కడ నిర్మించారు. గుజరాత్ టూరిజం ఆధ్వర్యంలో ఇండో పాక్ సరిహద్దు ప్రాంతమైన నడబెట్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. సరస్సులో చిన్న భూభాగంగా ఏర్పడిన నడబెట్ ప్రాంతం నుంచి పర్యాటకుల కోసం “సీమా దర్శన్ (సరిహద్దు వీక్షణ)” ఏర్పాటు చేసింది గుజరాత్ పర్యాటకశాఖ. భారత సరిహద్దుల్లోని ఆర్మీ పోస్ట్ పనితీరును వీక్షించే అవకాశం పర్యాటకులకు కల్పించనున్నారు. సూర్యాస్తమయ సమయంలో ఇక్కడ నిర్వహించే రిట్రీట్ వేడుకతో పాటు, సరిహద్దులకు కాపలాగా ఉన్న బిఎస్ఎఫ్ జవాన్లు సగర్వంగా నిర్వహించే కవాతును ప్రదర్శన పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

Also read:BSP Supremo Mayawati: కాంగ్రెస్ కు దళితులపై ప్రేమ ఎపుడూ లేదు: రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన మాయావతి

నడబెట్ వద్ద ఆయుధ ప్రదర్శన మరియు పలు రకాల తుపాకులు, ట్యాంకులు మరియు ఆర్మీకి చెందిన ఇతర అధునాతన పరికరాలు ప్రదర్శనాలో ఉంచారు. అంతకముందు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో కలిసి బనస్కాంతలోని నాదేశ్వరి మాత ఆలయంలో అమిత్ షా ప్రార్థనలు చేశారు. అనంతరం గాంధీనగర్ లోని నేషనల్ కోఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో అమిత్ షా పాల్గొనేందుకు వెళ్లారు. గాంధీనగర్ లో గుజరాత్ స్టేట్ కో-ఆపరేటర్ మార్కెటింగ్ ఫెడరేషన్, జియుజెకోమాసోల్ కార్యాలయాన్ని కూడా హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం ఆయన అహమ్మదాబాద్ లో ఆదర్శ్ సహకార గ్రామ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Also Read:TS Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. స్టార్ క్యాంపెయినర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి