బహుళ పొరలతో…ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్‌లు బెస్ట్

కోవిడ్ -19 యొక్క వ్యాప్తికి సంబంధించిన ముక్కు మరియు నోటి నుండి వైరల్ నిండిన బిందువులను బయటకు రాకుండా ట్రాప్ చేయడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్‌లు… వివిధ పొరల(Multiple Layers) ఫాబ్రిక్ నుండి తయారు చేయాలని ఓ స్టడీ కనుగొంది.
ఆస్ట్రేలియాలోని శాస్త్రవేత్తలు… సింగిల్ మరియు డబుల్ లేయర్ క్లాత్ ఫేస్ కవరింగ్ ప్రభావాన్ని.. సర్జికల్ మాస్క్ తో పోల్చారు. టైలర్‌డ్ ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్ మరియు హై-స్పీడ్ వీడియో కెమెరాను ఉపయోగించి…. మాట్లాడటం నుండి బిందువుల వ్యాప్తిని సింగల్ లేయర్ తగ్గించినట్లు వారు చూపించారు. కానీ డబుల్ లేయర్ కంటే తక్కువే అని వారు కనుక్కున్నారు.
దగ్గు, తుమ్ము వలన వ్యాప్తి చెందే డ్రాప్ లెట్స్ లేదా బిందువుల వ్యాప్తిని తగ్గించడంలో డబుల్ లేయర్ కూడా గణనీయంగా మెరుగ్గా ఉంది అయితే పరీక్షించిన అన్ని సినారియోలలో.. 3-ప్లై సర్జికల్ మాస్క్ ఉత్తమమైనదని సిడ్నీలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో రైనా మాక్ఇంటైర్ నేతృత్వంలోని పరిశోధకులు థొరాక్స్ జర్నల్ లో గురువారం ప్రచురించిన ఒక పేపర్ లో చెప్పారు.
ఫేస్ మాస్క్‌లు ఆరోగ్యకరమైన ప్రజలను అంటు బిందువులను పీల్చకుండా కాపాడుతాయని, అలాగే ఇప్పటికే సోకిన వారి నుండి వ్యాప్తిని తగ్గిస్తుందని భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణ పరికరాల కొరత…యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు ఇతర ఆరోగ్య అధికారులను సర్జికల్ ఫేస్ మాస్క్‌లకు ప్రత్యామ్నాయంగా ఇంట్లో తయారుచేసిన క్లాత్ పేస్ కవరింగ్స్ ను సిఫారసు చేయడానికి దారితీసింది.