ఏడాదికి కోటి రూపాయల జీతం మీక్కూడా కావాలంటే.. 2025లో ఇవి నేర్చుకోండి.. అత్యంత ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ ఇవే..

నెలకు లక్షలాది రూపాయలు సంపాదించాలంటే ఏయే నైపుణ్యాలు పెంచుకోవాలో తెలుసా?

ఏడాదికి కోటి రూపాయల జీతం మీక్కూడా కావాలంటే.. 2025లో ఇవి నేర్చుకోండి.. అత్యంత ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్ ఇవే..

Updated On : February 2, 2025 / 6:36 PM IST

కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే చాలామంది యువతకు లక్షలాది రూపాయల జీతాలు వస్తుంటాయి. పెట్టుబడులు పెట్టి, వ్యాపారం చేసేంత ధనం లేనివారు లక్షల్లో జీతాలు సంపాదించాలంటే వారికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్‌ ఉద్యోగాలు చేయడం. ఏయే ఉద్యోగాలు చేస్తే ఏడాదికి కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు. నెలకు లక్షలాది రూపాయల జీతం సంపాదించాలంటే ఏమేం నేర్చుకోవాలో చూద్దామా…

అత్యధిక జీతాలు అందించే పరిశ్రమలు

పరిశ్రమ వేతనం (ఏడాదికి) ఎవరికి అవకాశముంది?
ఏఐ అండ్ ఎంఎల్ రూ. కోటి –2 కోట్లు ఏఐ సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రూ. కోటి – 5 కోట్లు ఎండీలు, ఫండ్ మేనేజర్లు
ట్రేడింగ్ (హెచ్‌ఎఫ్‌టీ) రూ. కోటి – 3 కోట్లు క్వాంట్ ట్రేడర్లు,

ఆల్గో ట్రేడర్లు

బ్లాక్‌చెయిన్/వెబ్‌3 రూ. కోటి – 1.5 కోట్లు స్మార్ట్ కాంట్రాక్ట్

డెవలపర్లు

సైబర్‌సెక్యూరిటీ        రూ. కోటి సీఐఎస్‌వో,

సెక్యూరిటీ

ఆర్కిటెక్టులు

క్లౌడ్ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆపరేషన్‌ రూ. కోటి+ ప్రిన్సిపల్ క్లౌడ్

ఇంజినీర్లు

టెక్ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ కోటి+  వీపీ ఆఫ్ ప్రొడక్ట్,

డైరెక్టర్లు

వ్యవస్థాపకత రూ. కోటి–100 కోట్లు స్టార్టప్ ఫౌండర్లు

యాహూ.. అద్భుత ఫీచర్లతో వివో ఎక్స్‌200 ప్రో మినీ మోడల్‌ భారత్‌లో విడుదల కానుంది.. లీకైన వివరాలు ఇవే.. 

భారత్‌లో కోటి రూపాయల కన్నా ఎక్కువ జీతం పొందాలంటే?

  • అత్యధిక డిమాండ్ ఉన్న వృత్తిని ఎంచుకోవాలి (ఉదా: ఏఐ, ఫైనాన్స్, హెచ్‌ఎఫ్‌టీ, బ్లాక్‌చెయిన్)
  • ఉన్నతస్థాయిలో నైపుణ్యాలు సంపాదించండి
  • బలమైన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోండి (టాప్‌ కంపెనీలు మిమ్మల్ని నియమించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది)
  • గ్లోబల్ కంపెనీల్లో ఉద్యోగం చేయండి (అమెరికా కేంద్రంగా నడిచే కంపెనీలు 10 రెట్లు ఎక్కువ వేతనాలు ఇస్తాయి)
  • ఈఎస్‌ఓపీలు, బోనస్లను ఉపయోగించుకోండి (స్టాక్ ఆప్షన్లు కోట్ల రూపాయల విలువ కలిగి ఉండే అవకాశముంది)