Howdy Modi : ట్రంప్ స్పీచ్‌పై ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : September 22, 2019 / 12:54 AM IST
Howdy Modi : ట్రంప్ స్పీచ్‌పై ఉత్కంఠ

Updated On : September 22, 2019 / 12:54 AM IST

ఆరు రోజుల పర్యటన కోసం అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ… సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ప్రవాస భారతీయులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. టెక్సాస్ ఇండియన్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే హౌడీ – మోదీ ఈవెంట్‌కు సుమారు 50వేల మంది NRIలు హాజరవుతారు. మూడు వారాలకు ముందే వీళ్లంతా తమ తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటలకు హౌడీ-మోదీ ప్రారంభమవుతుంది.

ఈవెంట్‌లో ప్రధాని మోదీతో పాటు.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. సభలో తాను కొన్ని పెద్ద  ప్రకటనలు చేయనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. అయితే ఏ అంశంపై ప్రకటన  చేస్తారన్నది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. ట్రంప్‌ ప్రకటన భారత్-అమెరికాల  మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. గత  కొన్నిరోజులుగా అమెరికా భారత్‌ల మధ్య వ్యాపార ఒప్పందాలపై కొంత  వివాదం  నెలకొంది. దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. టారిఫ్‌ల విషయంలో భారత్-అమెరికా మధ్య సంబంధాలు కాస్త దెబ్బ తిన్నాయి. ఇలాంటి సమయంలో ఈ ఈవెంట్‌తో విబేధాలు సమసిపోతాయన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. 

అమెరికాలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన టెక్సాస్‌లో భారతీయ ప్రజలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది వ్యాపారాల్లో పేరు ప్రతిష్టలు సంపాదించిన వారే. ట్రంప్‌ కూడా వ్యాపార వర్గానికి చెందిన వారు కావడం, వచ్చే ఏడాది అమెరిక అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనుండడంతో  హౌడీ – మోదీ సభకు ప్రాధాన్యత ఇస్తున్నారు ట్రంప్‌. టెక్సాస్‌లో డెమొక్రాట్ల ప్రాభల్యం ఎక్కువగా ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో డెమొక్రాట్ల డామినేషన్ కి చెక్ పెట్టి, ఇండియన్ అమెరికన్లను తన రిపబ్లికన్ పార్టీవైపు తిప్పుకోవాలంటే.. ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. దీంతో… భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ ఈ సభకు హాజరవుతున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం మోదీ, ట్రంప్  ప్రసంగిస్తారు. రాత్రి 11 గంటలకు  ఈ కార్యక్రమం ముగుస్తుంది.
Read More : అమెరికాలో మోడీకి ఘన స్వాగతం