Delhi G-20 : ఢిల్లీలో జీ-20 సదస్సు, కొండముచ్చులా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం

G-20 సదస్సుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా కోతులపై కూడా దృష్టి సారించింది. అచ్చం కొండముచ్చుల్లా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది.

Delhi G-20 : ఢిల్లీలో జీ-20 సదస్సు, కొండముచ్చులా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపిన కేంద్ర ప్రభుత్వం

Delhi G-20 langur monkeys

Delhi G-20 summit.. langur monkeys : త్వరలోనే భారత్ లో జీ-20 (G-20)కూటమి (G20 summit)జరుగనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది. దీని కోసం ఢిల్లీ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన క్రమంలో అత్యంత ప్రతిష్ఠాత్మక రీతిలో జీ-20 ప్రధాన సదస్సు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. ఢిల్లీ మొత్తం ఫుల్ సెక్యురిటీ జోన్ లో ఉంది.

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే G-20 సదస్సుకు కేంద్రం తీసుకున్న చర్యల్లో భాగంగా కోతులపై కూడా దృష్టి సారించింది. ఈ సదస్సుకు కోతులకు సంబంధమేంటీ..? అనే డౌట్ రావచ్చు. ఢిల్లీలో కోతుల బెదడ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటితో సమస్యలు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. సదస్సుకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా కోతులను పారదోలేందుకు కేంద్రం వినూత్న నిర్ణయం తీసుకుంది. దీని కోసం కోతుల్లా అరిచే ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది. అచ్చంగా కొండముచ్చుల్లా అరిచే ఉద్యోగులను రంగంలోకి దింపింది. కొండముచ్చులను చూస్తే కోతులు పారిపోతాయనే విషయాన్ని గుర్తించి ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. అచ్చం కొండముచ్చులా అరిస్తే, నిజంగానే కొండముచ్చు అనుకుని కోతులు పరుగులు తీస్తాయన్నది అధికారుల ఆలోచన. దీని కోసం అచ్చంగా కొండముచ్చుల్లా అరిచేందుకు ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది.

Chandrayaan 3: ఇస్రో సంచలనం.. జాబిల్లిపై ఉన్న మూలకాలను గుర్తించిన రోవర్

లుట్యెన్స్ ఢిల్లీ వంటి చారిత్రక ప్రదేశాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉంటుంది. వీటితో పెద్ద సమస్యగా తయారైంది ఆయా ప్రాంతాల్లో. వీటిని నియంత్రించేందుకు నగర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నో చర్యలు చేపట్టినా ఎటువంటి ఫలితం ఉండటంలేదు. ఈక్రమంలో ఢిల్లీలో జీ-20 సదస్సుకు కోతుల వల్ల అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ), అటవీశాఖ సిబ్బంది ఈ నిర్ణయం అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. జీ-20 సమావేశాలు జరిగే వేదిక ప్రాంతంలో ముఖ్యంగా ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా విదేశాల నుంచి వచ్చే గెస్టులు బస చేసే హోటళ్ల వద్ద కోతుల వల్ల సమస్యలు రాకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

ఎన్డీఎంసీ వైస్ చైర్మన్ సతీశ్ ఉపాధ్యాయ్ (Satish Upadhyay)దీనిపై మాట్లాడుతు..కోతుల నియంత్రణ కోసం..వాటి వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అచ్చంగా కొండముచ్చులా అరిచే ఉద్యోగులను ఎంపిక చేశామని తెలిపారు. దాదాపు 40మంది ప్రత్యేక ఉద్యోగులను మోహరించి నగరంలోకి కీలక ప్రాంతాల్లో వారిని మోహరిస్తామని వివరించారు. కొండముచ్చులు ఉన్న చోటికి కోతులు రావు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొండముచ్చుల బొమ్మలను ఏర్పాటు చేస్తామని, వాటిని చూసి కోతులు వెనక్కి వెళ్లిపోతాయని భావిస్తున్నామని తెలిపారు.