ఫ్యాషన్ షో చిచ్చు : స్కూల్ లోనే భార్యపై భర్త కాల్పులు

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 05:29 AM IST
ఫ్యాషన్ షో చిచ్చు : స్కూల్ లోనే భార్యపై భర్త కాల్పులు

Updated On : April 30, 2019 / 5:29 AM IST

ఇష్టంలేని పని చేసిన భార్యను మందలిస్తారు లేదా హెచ్చరిస్తాడు. అయినా మారకపోతే కొట్లాట వరకు వెళుతుంది వ్యవహారం. ఢిల్లీలో మాత్రం ఆ భర్త కోపానికి భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఫ్యాషన్ షోలు చేయొద్దని పదేపదే చెప్పినా భార్య వినటం లేదంటూ.. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. భార్యపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఢిల్లీలోని గురుగ్రాంలో జరిగింది. 2019, ఏప్రిల్ 28న  జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

10 సంవత్సరాల క్రితం ఇంద్రజీత్ అనే వ్యక్తితో ఆశారాణికి పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆశారాణి స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. ఆమె పని చేస్తున్న స్కూల్లోనే ఫ్యాషన్ షో నిర్వహించారు. ఈ షోలో ఆశారాణి పాల్గొన్నది. షోలో పాల్గొన వద్దని.. భర్త ముందే హెచ్చరించాడు. దీన్ని పట్టించుకోని భార్య ఆశారాణి షోలో పాల్గొంది. అందరితో శెభాష్ అనిపించుకుంది.

ఈ విషయం తెలిసి భర్త ఇంద్రజిత్.. ఏకంగా స్కూల్ దగ్గరకే వెళ్లాడు. బయటకు తీసుకువచ్చి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆశారాణి తీవ్రంగా గాయపడింది. స్కూల్ సిబ్బంది  ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉంది. వెంటిలేటర్ పై ఉంది. ఈ ఘటనపై ఇంద్రజీత్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.