ఉల్లిపాయలు తినకపోతే ధరల గురించి పట్టించుకోరా ?

  • Published By: chvmurthy ,Published On : December 5, 2019 / 07:52 AM IST
ఉల్లిపాయలు తినకపోతే ధరల గురించి పట్టించుకోరా ?

Updated On : December 5, 2019 / 7:52 AM IST

దేశంలో ఉల్లి ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఏపీలో కిలో ఉల్లి 150 కి చేరితే, తమిళనాడులో 180కి చేరింది. హైదరాబాద్ లో 130-150 మధ్య ఉల్లిధర పలుకుతోంది. కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఉల్లిపాయలు. ఉల్లిధరలు పార్లమెంట్ లోనూ చర్చకు వచ్చాయి.

ఎన్సీపీ  ఎంపీ సుప్రియా సూలే గురువారం లోక్ సభలో ఉల్లిధరల అంశాన్ని లేవనెత్తారు. ఈసందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్  చేసిన వ్యాఖ్యలు  చర్చకు  దారితీసాయి. దేశంలో ఉల్లి సంక్షోభాన్ని నివారించేందుకు  కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దీనిలో భాగంగానే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించి, విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటున్నామని  ఆమె వివరించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ”  నేను ఉల్లి పాయలు, వెల్లుల్లి ఎక్కువగా తినను.మీరు పెద్దగా చింతించకండి. ఆ రెండిటినీ  పెద్దగా వాడని కుటుంబంనుంచి వచ్చాను” అనటంతో సభలో నవ్వులు విరిసాయి. కానీ విపక్ష సభ్యులు  ఆమె వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు.  నెటిజన్లు కూడా ఆమె  వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.