అద్వానీని కలుస్తా..అయోధ్యకు వెళ్తా…ఉథ్థవ్ ఠాక్రే

  • Published By: chvmurthy ,Published On : November 9, 2019 / 11:19 AM IST
అద్వానీని కలుస్తా..అయోధ్యకు వెళ్తా…ఉథ్థవ్ ఠాక్రే

Updated On : November 9, 2019 / 11:19 AM IST

భారత దేశ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు అని శివసేన చీఫ్ ఉథ్థవ్ ఠాక్రే అభివర్ణించారు, వివాదస్పద స్థలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ అంగీకరించారని ఆయన అన్నారు.  నవంబర్ 24న అయోధ్యకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు.  ఈలోగా రామ జన్మభూమి కోసం రధయాత్ర నిర్వహించిన అద్వానీని కుడా కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని ఉథ్థవ్ ఠాక్రే చెప్పారు. 

ఇదిలా ఉండగా … అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు.  అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని మందిర నిర్మాణానికి ఏర్పాటు చేసే ట్రస్ట్‌కు అప్పగించాలని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు చెప్పిన నేపధ్యంలో ఆయన  ఘాటుగా విమర్శించారు.