ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే : సత్తా చూపనున్న ఐఏఎఫ్, విమానాల విన్యాసాలు

IAF 88th anniversary celebration : 88వ వార్షికోత్సవానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రెడీ అయింది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో… శత్రువుకు వార్నింగ్ ఇచ్చేలా విన్యాసాలు జరుగనున్నాయి. 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం హిందాన్ ఎయిర్‌బేస్‌లో జరిగే ఈ ఈవెంట్‌ను మొదటిసారిగా రాఫెల్ లీడ్ చేయనుంది.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కొత్తగా చేరిన రాఫెల్ ఫైటర్స్ తమ అసలైన సత్తాను చూపించేందుకు సిద్ధమయ్యాయి. గురువారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 88వ వార్షికోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా.. వాయుసేనలోని యుద్ధ విమానాలు విన్యాసాలతో హోరెత్తించనున్నాయి.
ఉత్తరప్రదేశ్ హిందాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరిగే వైమానికదళ వార్షికోత్సవ పరేడ్‌లో రఫేల్ పాలుపుంచుకుంటున్నట్లు ఐఏఎఫ్ ప్రకటించింది. టోటల్ ఈవెంట్‌ను రాఫెల్ లీడ్ చేస్తుందని వెల్లడించింది. 1932 అక్టోబర్ 8న.. బ్రిటీష్ హయాంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను స్థాపించారు.
ఈసారి వార్షికోత్సవం సందర్భంగా జరిగే గగనతల విన్యాసాల్లో 56 విమానాలు పాల్గొనబోతున్నట్టు ఐఎఏఫ్ ప్రకటించింది. మొత్తం 19 యుద్ధ విమానాలు, 7 రవాణా విమానాలు, 19 హెలికాప్టర్లు పరేడ్‌లో పాల్గొంటాయి. చైనాతో ఉద్రిక్తతల సమయంలో IAF తన సత్తాను శత్రువుకు చాటి చెప్పబోతోంది.
ఇప్పటికే రిహార్సల్స్ కంప్లీట్ అయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానాలు కూడా రిహార్సల్స్‌లో కనువిందు చేశాయి. ఆకాశంలో ఫీట్లు చేస్తూ ఫైటర్ జెట్స్ చక్కర్లు కొట్టాయి. ఈసారి ఎయిర్‌ఫోర్స్ డేలో అందరీ చూపు రఫేల్ యుద్ద విమానాలపైనే ఉంది. శత్రువు పసిగట్టేలోగా మెరుపువేగంతో దాడులు చేయగల సమార్థ్యం ఉన్న రాఫెల్ రాకతో.. పాకిస్తాన్, చైనాతో యుద్ధం చేసే సామర్ధ్యం ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు వచ్చిందని ఐఏఎఫ్ చీఫ్ ఇటీవలే ప్రకటించారు.
ఇక పరేడ్‌లో రెండు రాఫెల్ యుద్ద విమానాలతో పాటు రుద్ర, చినూక్.. ఏకలవ్య, అపాచీ, సీ 130 జే, మిగ్ 29 ఎస్, బైసన్, ఎస్ 30 ఎంకేఐ, మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ విమానాలను ప్రదర్శిస్తారు. మరోవైపు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 88 ఏళ్ల జర్నీకి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేసింది ఐఏఎఫ్. అత్యాధునికి క్షిపణులు , మందుగుండు సామాగ్రి, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు సత్తా చాటాయి.