సున్నితంగా తిప్పికొట్టిన ఐఏఎస్ ఆఫీసర్.. మళ్లీ ప్రభుత్వంతో పని చేయను

సున్నితంగా తిప్పికొట్టిన ఐఏఎస్ ఆఫీసర్.. మళ్లీ ప్రభుత్వంతో పని చేయను

Updated On : April 10, 2020 / 3:53 PM IST

మాజీ ఐఏఎస్ అధికారి కణ్నన్ గోపీనాథన్ ను మరోసారి భారత ప్రభుత్వం విధుల్లోకి చేరమంటూ ఆహ్వానించినప్పటికీ సున్నితంగా తిప్పికొట్టారు. కరోనా వైరస్ మహమ్మారి విధుల నేపథ్యంలో వెంటనే జాయిన్ అవ్వాలని ప్రభుత్వం నుంచి ఆయనకు ఆర్డర్ వెళ్లింది. 8నెలల క్రితం చేసిన రాజీనామా ఇంకా ఆమోదించలేదని వెంటనే జాయిన్ అవ్వాలని కోరింది. 

డామన్, డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదని అప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగించొచ్చని లెటర్ అందింది. ‘మీకు అప్పగించిన డ్యూటీ పూర్తి చేయాలి. యూటీ అడ్మినిస్ట్రేషన్ కు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కరోనా వైరస్ మహమ్మారిగా మారుతుంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని డిపార్ట్‌మెంట్లు, రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లు వ్యాప్తిని అడ్డుకోవాల్సి ఉంది’ అని అందులో ఉంది. 

ఈ ఫొటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్న గోపీనాథన్ తిరిగి అధికారిక విధుల్లోకి చేరాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. తాను సిద్ధంగా లేనని అన్నాడు. 

 ‘రాజీనామా చేసి దాదాపు 8నెలలు కావొస్తుంది. ప్రభుత్వానికి ఒక్కటే తెలుసు. ప్రజలను, అధికారులను వేధించడమే. మున్ముందు కూడా వేధించాలనుకుంటున్నారని నాకు తెలుసు. కానీ, ఇప్పటికీ నేను వాలంటీర్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ, ఐఏఎస్ గా మాత్రం తిరిగి జాయిన్ అవ్వలేను’ అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. 

జమ్మూ కశ్మీర్లో లక్షల మంది ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపించిన గోపీనాథన్.. రాజీనామా చేశారు. ఆ సమయంలో ఇది నా రాజీనామా మాత్రమే కాదు. నా అంతరాత్మ కోరుకుంటుంది ఇదే’ అని అప్పట్లో చెప్పాడు. ఐఏఎస్ ఆఫీసర్ గా ఏడేళ్లుగా పనిచేసిన గోపీనాథన్ గతేడాది ఆగష్టు 21న రాజీనామా చేశారు.