IAS Officer ఫేక్ ప్రొఫైల్‌తో CAAపై సెటైర్లు

దేశవ్యాప్తంగా CAAపై జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి పేరుపై ఉన్న అకౌంట్ తో కామెంట్లు వచ్చాయి. ఐఏఎస్ టీనా దాబి ఫేక్ అకౌంట్ పేరుతో పౌరసత్వపు చట్టం(Citizenship Act)పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు.
ఏఎన్ఐ మీడియా కథనం ప్రకారం.. ఐఏఎస్ టీనా దాబిను తన అకౌంట్‌లో పౌరసత్వపు చట్టంపై విమర్శలు చేయడంపై మీడియా ప్రశ్నించింది. దానికి స్పందిస్తూ అది ఒక ఫేక్ పేజ్ అని కామెంట్ చేసింది. అలాంటప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయాలి కదా అని అడిగితే చేస్తాను.. కంప్లైంట్ చేస్తాను అని వివరించింది.
మంగళవారం ఆమె పేరుతో ఉన్న ఫేక్ సోషల్ మీడియా అకౌంట్‌తో పౌరసత్వపు చట్టంపై విమర్శలు చేసిన పోస్లు వైరల్ గా మారింది. 2014 డిసెంబరు 31 నాటికి భారత్‌లో ఉంటున్న పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ వాసులకు పౌరసత్వం కల్పిస్తుండటమే ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో కొన్ని సామాజిక వర్గాలకు మినహాయింపు ఉంది.