కరోనా కట్టడికి స్వయంగా రంగంలోకి, పోలీసుగా విధులు, రియల్ హీరో అనిపించుకున్న భారత క్రికెటర్

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 11:46 AM IST
కరోనా కట్టడికి స్వయంగా రంగంలోకి, పోలీసుగా విధులు, రియల్ హీరో అనిపించుకున్న భారత క్రికెటర్

Updated On : March 29, 2020 / 11:46 AM IST

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలకు నచ్చ చెప్పి పంపేస్తున్నారు. దయచేసి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి పోలీసులు డ్యూటీ చేస్తున్నారు.

తాజాగా భారత మాజీ క్రికెట‌ర్‌ జోగింద‌ర్ శ‌ర్మ‌ నేను సైతం అంటూ రంగంలోకి దిగాడు. క‌రోనా వ్యాప్తి క‌ట్ట‌డికి న‌డుం బిగించాడు. తన సొంత రాష్ట్ర‌మైన హ‌ర్యానాలో ఖాకీ దుస్తులు ధ‌రించి వీధుల్లో డ్యూటీ చేస్తున్నాడు. జోగిందర్ డ్యూటీలో ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై అంత‌ర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పందించింది. అత‌డిని రియ‌ల్ వరల్డ్ హీరోగా అభివ‌ర్ణించింది. ప్ర‌పంచమంతా క‌రోనా సంక్షోభం ఎదుర్కొంటున్న స‌మ‌యంలో త‌న‌వంతు కృషి చేస్తున్నాడ‌ని కొనియాడింది. 

ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ బాధ్య‌తాయుతంగా విధులు నిర్వ‌ర్తించ‌డాన్ని నెటిజ‌న్లు సైతం కీర్తిస్తున్నారు. క‌రోనా నుంచి జ‌నాల‌ను కాపాడేందుకు వీధుల్లో చెమ‌టోడ్చుతున్నాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆఖ‌రి ఓవ‌ర్‌ వేసిన జోగింద‌ర్‌ అద్భుత‌మైన బౌలింగ్‌తో భార‌త్‌ను గెలిపించాడు. దీంతో ఓవ‌ర్‌ నైట్ స్టార్‌గా మారిపోయిన జోగింద‌ర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. క్రికెట్‌లో అందించిన సేవ‌ల‌కుగానూ హ‌ర్యానా ప్ర‌భుత్వం అత‌న్ని డీఎస్పీ (డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌)గా నియ‌మించిన విష‌యం తెలిసిందే.

జోగిందర్ శర్మ ప్రస్తుతం హిసార్ లో విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 30వేల మందిని కరోనా బలితీసుకుంది. మన దేశంలో కరోనాతో 26మంది చనిపోయారు. 900 మంది కరోనాతో బాధపడుతున్నారు.

”2007 నుంచి నేను డీఎస్పీగా ఉన్నాను. కరోనా పంజా విసురుతున్న ఈ పరిస్థితుల్లో పోలీసుగా విధులు నిర్వహించడం సవాల్ లాంటిది. ఎందుకంటే కరోనా గురించి అంతా భయపడుతున్నారు. ఇలాంటి అనేక సవాళ్లు నేను నా క్రికెట్ కెరీర్ లో చూశాను” అని జోగిందర్ శర్మ చెప్పాడు.