Bhagwant Mann: 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిచిందనుకో మోదీ ఇలా మారిపోతారు జాగ్రత్త: పంజాబ్ సీఎం
మోదీని ఇప్పటికే బీజేపీ నేతలు చక్రవర్తిగా అభివర్ణిస్తున్నారని చెప్పారు.

Bhagwant Mann
Bhagwant Mann – AAP: ప్రధాని నరేంద్ర మోదీపై పంజాబ్ (Punjab) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (LokSabha Elections 2023) బీజేపీ గెలిస్తే నరేంద్ర మోదీ.. నరేంద్ర పుతిన్‌గా మారతారని చెప్పారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. తనకు ఇష్టం వచ్చిన విధానాలను కొనసాగిస్తున్నారు. 2012 నుంచి ఆయనే రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు.
” ఒకవేళ 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక ఆ తర్వాత దేశంలో ఎన్నికలే ఉండవు. నరేంద్ర మోదీ ఇక నరేంద్ర పుతిన్ అవుతారు ” అని భగవంత్ మాన్ అన్నారు. మోదీని ఇప్పటికే బీజేపీ నేతలు చక్రవర్తిగా అభివర్ణిస్తున్నారని చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది భారత్ ను రక్షించాలని నిర్ణయం తీసుకుంటే దేశం రక్షించబడుతుందని వ్యాఖ్యానించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రామ్ లీలా మైదానంలో మహా ర్యాలీ చేపట్టింది. ఇందులోనే మాట్లాడుతూ భగవంత్ మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో పాలన అధికారాలపై కేంద్ర సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్ ఈ ర్యాలీ చేపట్టింది. ఆప్ ముఖ్యనేతలు అందరూ ప్రసంగించారు.
BJP Leaders : జేపీ నడ్డాను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు : బీజేపీ నేతలు