అన్న ఆదేశిస్తే వారణాశి నుంచి పోటీ చేస్తా

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2019 / 01:25 PM IST
అన్న ఆదేశిస్తే వారణాశి నుంచి పోటీ చేస్తా

Updated On : April 21, 2019 / 1:25 PM IST

ఉత్తరప్రదేశ్ లోని వారణాశి లోక్ సభ స్థానుంచి పోటీ చేసేందుకు తాను రెడీగా ఉన్నానని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పోటీగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే ఆ స్థానం నుంచి తాను సంతోషంగా పోటీ చేస్తానని ప్రియాంక తెలిపారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ కి మద్దతుగా వయనాడ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
 
2014 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన అజయ్‌ రాయ్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మోడీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.