Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌తో ముఖ్యమంత్రి రహస్య సమావేశం.. ఎందుకు?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య సమావేశం జరిగింది.

Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌తో ముఖ్యమంత్రి రహస్య సమావేశం.. ఎందుకు?

Prashant Kishor

Updated On : February 19, 2022 / 5:34 PM IST

Prashant Kishor: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య రహస్య సమావేశం జరిగింది. టీఎంసీలో ప్రశాంత్ కిషోర్ భవితవ్యం ఏంటో స్పష్టత లేని సమయంలో ఈ భేటీ చర్చనీయాంశం అవుతోంది.

నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్ డిన్నర్ మీటింగ్ గురించి బీహార్ సీఎం నితీష్ కుమార్‌ను ప్రశ్నించగా, ఈరోజు నుంచి ప్రశాంత్ కిషోర్‌తో నా బంధమా? సమావేశం వెనుక నిర్దిష్ట ఉద్దేశ్యం లేదు.

బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఈ సమయంలో చాలా మందిని కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తన పాత స్నేహితుడు ప్రశాంత్ కిషోర్‌ను కూడా కలిశారు.

సర్ ప్రైజ్ డిన్నర్‌కు సంబంధించి మాట్లాడుతూ.. కిషోర్‌తో తన భేటీ సాధారణ విషయమని స్పష్టంగా చెప్పారు నితీష్ కుమార్. నితీష్‌ కుమార్‌ ప్రకటనల తర్వాతే ప్రశాంత్‌కిషోర్‌ జేడీయూ నుంచి విడిపోయినా.. ఈ భేటీపై రాజకీయాల్లో అనేక అంశాలు గురించి చర్చ జరుగుతోంది.

2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ కొత్త ఎత్తులు వేయబోతున్నారని, ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్‌తో సీఎం నితీశ్ భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మమతా బెనర్జీతో ప్రశాంత్ కిషోర్ ఉండగా.. అతను గత కొన్ని నెలలుగా చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులను కలుస్తూ వస్తున్నారు.

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించవచ్చని, అయితే, అందుకు మంచి వ్యూహం రూపొందించాల్సి ఉందని ప్రశాంత్ కిషోర్ చెప్పిన కొన్ని రోజులకే సీఎంను కలవడం చర్చనీయాంశం అవుతోంది.