వాతావరణ మార్పులకు ఇదే సంకేతం : కేరళ మున్నార్‌లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

వాతావరణ మార్పులకు ఇదే సంకేతం : కేరళ మున్నార్‌లో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Updated On : February 12, 2021 / 8:31 AM IST

climate change Munnar records in February : వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం కేరళలోని కొండ ప్రాంతమైన మున్నార్‌పై ఎక్కువగా కనిపిస్తోంది. వాతావరణ మార్పులకు గట్టి సంకేతాల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. దక్షిణ భారత కశ్మీర్‌గా పేరొందిన మున్నార్‌లో గురువారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఫిబ్రవరి నెలలో అసాధారణ స్థాయిలో అధికంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణంగా మున్నార్ కొండ ప్రాంతంలో నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో హిమపాతం కురుస్తుంటుంది. ఫిబ్రవరిలో పాదరసం స్థాయి క్రమంగా పెరుగుతుంది. ఈ సీజన్‌లో లక్ష్మి ఎస్టేట్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు మైనస్ 2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.

మున్నార్‌లోని ఇతర ప్రదేశాలైన సైలెంట్ వ్యాలీ (-2), చెండువరాయ్ (-2), నలుతన్నీ (-1), మున్నార్ యుపాసి (-1), సేవన్మలై (0), మాటుపెట్టి (0) ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో పడిపోయాయి. గత కొన్నేళ్లుగా మున్నార్‌లో వాతావరణం అంచనాకు మించిందని నిపుణులు అంటున్నారు. వాతావరణ మార్పులను అంచనా వేయడం కష్టమంటున్నారు. నిరంతర వర్షం కారణంగా దాదాపు మూడు వారాల ఆలస్యంగా మున్నార్‌లో శీతాకాలం వచ్చింది. జనవరి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పటికీ మళ్లీ పెరిగాయి. ఇప్పుడు, ఫిబ్రవరిలో మాత్రం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి.
Munnar records -2°C in February2019లో ఇడుక్కి, మున్నార్‌లో తీవ్రమైన శీతల పరిస్థితులు నమోదయ్యాయి. చల్లటి గాలులు కూడా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 4 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గాయి. కాశ్మీర్, కులు మనాలిలలో సాధారణంగా హిమపాతం నమోదవుతుంటుంది. ఈ సీజన్లో కేరళ వాతావరణ పరిస్థితులలో ఇది చాలా అరుదుగా జరుగుతుందని, ఇలాంటి సంఘటనలు వాతావరణ మార్పులలో భాగమని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇడుక్కి వంటి ఎత్తైన ప్రదేశాలలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా రాత్రి సమయంలో పెరుగుతాయి. పడిపోతాయి. మున్నార్ రాత్రి తీవ్రమైన చలి ఉంటుంది. పర్యాటక ప్రాంతాలైన మున్నార్, ఇడుక్కి ప్రాంతాల్లో 2019లో సుమారు 2.5 లక్షల మంది ప్రజలు సందర్శించారు.