Indian Post Office : పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్..విత్ డ్రా లిమిట్ పెంపు

ఇండియా పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది.

Indian Post Office : పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు గుడ్ న్యూస్..విత్ డ్రా లిమిట్ పెంపు

Post Office

Updated On : August 11, 2021 / 9:09 PM IST

Indian Post Office Clients : ఇండియా పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది. ఇండియా పోస్ట్ కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అయితే అంతకుముందు విత్ డ్రా లిమిట్ రూ.5,000గా ఉండేది.

కొత్త మార్గదర్శకాలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) ఒక రోజులో ఒక ఖాతాలో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించరాదు. ఒక రోజులో ఒక ఖాతా ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయలేము. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్ కమ్ స్కీం (ఎంఐఎస్), కిసాన్ వికాస్ పాత్రా(కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ) స్కీంల కోసం డిపాజిట్ లేదా విత్ డ్రా చెక్కులు ద్వారా చేయవచ్చు.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీం
పోస్టాఫీసు పొదుపు పథకంపై 4% వడ్డీ లభిస్తుంది. తపాలా కార్యాలయ పొదుపు పథకం ఖాతాలో కనీసం రూ.500 బ్యాలెన్స్ ఉంచాలి. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద జరిమానాగా రూ.100 వసూలు చేస్తారు.

పోస్టాఫీసు పొదుపు పథకాలు : వడ్డీ రేటు
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా 4 శాతం, ఏడాది వరకు టీడీ ఖాతా 5.5 శాతం, రెండేళ్ల వరకు టీడీ ఖాతా 5.5 శాతం, ఐదేళ్ల వరకు టీడీ ఖాతా 6.7 శాతం, ఐదేళ్ల ఆర్ డీ 5.8 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 7.4 శాతం, పీపీఎఫ్ పొదుపు పథకం 7.1 శాతం, కిసాన్ వికాస్ పాత్ర 6.9 శాతం, సుకన్య సమృద్ధి ఖాతాదారులకు 7.6శాతం.