Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులో రూ.300లకు పైగా పెరిగింది.

Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర

Gold

Updated On : August 12, 2021 / 9:35 PM IST

Increased gold price : బంగారం ధర భారీగా పెరిగింది. ఒక్క రోజులో రూ.300లకు పైగా పెరిగింది. వారం రోజుల్లో బంగారం ధర 1,500 రూపాయలకు పైగా పడిపోయింది. బులియన్ జ్యూవెల్లరి మార్కెట్ లో ఆగస్టు 5న రూ.48,000గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. ఇవాళ రూ.300 పెరిగి రూ.46,500కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.42,683కు చేరింది.

హైదరాబాద్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. రూ.47,300గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.260 పెరిగి రూ.47,560కు చేరుకుంది. రూ.43,350గా ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,600కు పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఇవాళ కేజీ వెండి ధర రూ.62,773 నుంచి రూ.62,704లకు తగ్గింది.