India Alliance meeting : ఢిల్లీలో ఇండియా కూటమి నాలుగో సమావేశం.. సీట్ల పంపకాలతో పాటు కీలక అంశాలపై చర్చ

ఇండియా కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైంది.

India Alliance meeting : ఢిల్లీలో ఇండియా కూటమి నాలుగో సమావేశం.. సీట్ల పంపకాలతో పాటు కీలక అంశాలపై చర్చ

Updated On : December 19, 2023 / 4:20 PM IST

India Alliance fourth meeting : ఇండియా కూటమి నాలుగో సమావేశం ఢిల్లీలోని అశోక హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ, శరత్ పవార్,బీహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. అలాగే.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవిత్ కేజ్రీవాల్,పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తేజస్వియాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, ఉద్ధవ్ ఠాక్రే, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా, పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి..? రాష్ట్రాల్లో సీట్ల పంపకాలు అనే పలు కీలక అంశాలపై ఇండియా కూటమి చర్చలు జరుపుతోంది. ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని రూపొందించటం, భవిష్యత్ కార్యాచరణ అనే అంశాలపై నేతలు అంతా చర్చిస్తున్నారు.

ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలల్లో వచ్చిన ప్రతికూల అంశాలపై కూడా కూటమి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ ఏడాది చివరినాటికి సీట్ల సర్ధుబాటు అంశాలపై ఓ నిర్ణయానికి రావాలని కూటమిలో పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సీట్ల పంపకాలపై చర్చ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.