India-China face off: భారత్-చైనా సైనికుల ఘర్షణపై నేడు పార్లమెంటులో తీర్మానం
భారత్-చైనా సైనికుల ఘర్షణపై నేడు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశం ఆలస్యంగా తెలిసింది. సరిహద్దుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

India-China face off
India-China face off: భారత్-చైనా సైనికుల ఘర్షణపై నేడు పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అంశం ఆలస్యంగా తెలిసింది. సరిహద్దుల వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి.
ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. తాజాగా చోటుచేసుకున్న ఘర్షణపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఎందుకు తెలియజేయలేదని అసదుద్దీన్ ఒవైసీ నిన్న ట్విట్టర్ లో నిలదీసిన విషయం తెలిసిందే. అలాగే, పలు పార్టీలు కేంద్ర సర్కారు తీరుపై అభ్యంతరాలు తెలిపాయి.
తవాంగ్ సెక్టార్ లోని ఎల్‌ఏసీ దాటి చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించడంతో వారిని భారత ఆర్మీ అడ్డుకుంది. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని భారత్-చైనా సైనికులు గాయపడ్డారు. 2020లో గల్వాన్ లో ఇటువంటి ఘటనే జరిగి కలకలం చెలరేగింది. ఆ తర్వాత చోటు చేసుకున్న తొలి ఘర్షణ ఇదే.
తాజాగా ఘర్షణ చోటుచేసుకున్న వెంటనే చైనా కమాండర్ తో భారత కమాండర్ చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం చల్లబడింది. పార్లమెంటులో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గట్టిగా నిలదీసే అవకాశాలు కనపడుతున్నాయి. ఘర్షణల అంశాన్ని కప్పిపుచ్చేందుకు కేంద్ర సర్కారు ప్రయత్నిస్తోందని విపక్షాలు అంటున్నాయి.
India vs China: బోర్డర్‌లో ఉద్రిక్తత.. భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాల సైనికులకు గాయాలు