కరోనావైరస్: దేశంలో 24 గంటల్లో 49 వేలకు పైగా కేసులు

  • Published By: vamsi ,Published On : July 27, 2020 / 10:50 AM IST
కరోనావైరస్: దేశంలో 24 గంటల్లో 49 వేలకు పైగా కేసులు

Updated On : July 27, 2020 / 11:27 AM IST

భారత్‌లో కరోనా వేగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఇవాళ(27 జులై 2020) దేశంలో కరోనా కేసులు 14 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 49 వేల 931 మందికి కొత్తగా వైరస్ సోకింది.

అదే సమయంలో 708 మంది కూడా మరణించారు. ఈ మరణాలు యుఎస్ మరియు బ్రెజిల్ కంటే ఎక్కువ. యుఎస్ మరియు బ్రెజిల్లో గత 24 గంటల్లో వరుసగా 445 మరియు 556 మరణాలు సంభవించాయి. అయితే, మెక్సికో (729) కంటే భారతదేశంలో తక్కువ మరణాలు సంభవించాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాజా సమాచారం ప్రకారం, భారతదేశంలో ఇప్పటివరకు 14 లక్షల 35 వేల 453 మందికి కరోనా సోకింది. వీరిలో 32,771 మంది మరణించగా, 9 లక్షల 17 వేల 568 మంది కోలుకున్నారు. నాలుగు లక్షల 85 వేల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రాష్ట్రాలవారీగా గణాంకాలు:

క్రమ సంఖ్య రాష్ట్రం పేరు మొత్తం కరోనా కేసులు
కోలుకున్నవారు మరణాలు
1 అండమాన్ నికోబార్ 324 182 0
2 ఆంధ్రప్రదేశ్ 96298 46301 1041
3 అరుణాచల్ ప్రదేశ్ 1158 505 3
4 అస్సాం 32228 24040 79
5 బీహార్ 39176 25815 244
6 చండీగఢ్ 887 572 13
7 ఛత్తీస్గఢ్ 7450 4944 43
8 ఢిల్లీ 130606 114875 3827
9 గోవా 4861 3277 35
10 గుజరాత్ 55822 40365 2326
11 హర్యానా 31332 24384 392
12 హిమాచల్ ప్రదేశ్ 2176 1198 12
13 జమ్మూ కాశ్మీర్ 17920 9928 312
14 జార్ఖండ్ 8275 3704 85
15 కర్ణాటక 96141 35838 1878
16 కేరళ 19025 9300 61
17 లడఖ్ 1285 1063 4
18 మధ్యప్రదేశ్ 27800 19132 811
19 మహారాష్ట్ర 375799 213238 13656
20 మణిపూర్ 2235 1554 0
21 మేఘాలయ 702 135 5
22 మిజోరం 361 193 0
23 ఒడిషా 25389 16793 140
24 పుదుచ్చేరి 2786 1645 40
25 పంజాబ్ 13218 8810 306
26 రాజస్థాన్ 35909 25353 621
27 తమిళనాడు 213723 156526 3494
28 తెలంగాణ 54059 41332 463
29 త్రిపుర 3900 2361 13
30 ఉత్తరాఖండ్ 6104 3566 63
31 ఉత్తర ప్రదేశ్ 66988 41641 1426
32 పశ్చిమ బెంగాల్ 58718 37751 1372
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 1435453 917568 32771

ప్రస్తుతం దేశంలో సుమారు 5 లక్షల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యంత చురుకైన కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి.

మహారాష్ట్రలో, లక్ష 40 వేలకు పైగా ప్రజలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రెండో స్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో, గుజరాత్ నాలుగవ స్థానంలో, పశ్చిమ బెంగాల్ ఐదవ స్థానంలో ఉన్నాయి.