ఇండియా ఫస్ట్ టైమ్ : హెల్మెట్ బ్యాంకులు

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 10:52 AM IST
ఇండియా ఫస్ట్ టైమ్ : హెల్మెట్ బ్యాంకులు

నీమచ్: హెల్మెట్స్ లేకుండా ప్రయాణిస్తే..ప్రాణాలకే ప్రమాదం అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లాలో దేశంలోనే తొలిసారిగా హెల్మెట్ బ్యాంకులు ప్రారంభంకానున్నాయి. ఈ బ్యాంకుల వల్ల నీమచ్ జిల్లాలోని 236 సంచాయితీలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకం రోడ్డు ప్రమాదాల నివారణకు.. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. 

 

ఈ హెల్మెంట్ బ్యాంకులు మొదటి విడతగా జిల్లాలోని మెయిన్ హైవేల వెంట ఉండే 150 పంచాయతీలలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం జిల్లా ట్రాఫిక్ కమిటీ పలు పోలీసు స్టేషన్ల నుంచి ఎన్నో వివరాలను సేకరించనుంది. ప్రత్యేక పంచాయతీలలో కనీసం 7 హెల్మెట్లను అందుబాటులో ఉంచనున్నారు. జిల్లా ట్రాఫిక్ కమిటీ మొత్తం 800 హెల్మెట్లను కొనుగోలు చేసి..వాటిని టూవీలర్స్ ఉండీ హెల్మెంట్స్ లేని వారికి రూ. 50 అద్దెకు ఇవ్వనుంది. జిల్లాలోని హైవేలలో 10 కంటే ఎక్కువగా యాక్సిడెంట్ జోన్లు ఉండగా..గత మూడు సంవత్సరాల్లో రోడ్డు ప్రమాదాల్లో 242 మంది మృతి చెందారు. మరో 1301 మంది తీవ్రంగా  గాయాలపాలయ్యారు. 

 

ఈ పథకం అమలు చేసేందుకు పంచాయితీకి సంబంధించిన ఓ ఉద్యోగి హైవేల వద్ద కాపలాగా ఉండి..హెల్మెట్లు లేని టీవర్స్ ను గుర్తించి..వారిని ఆపి..హెల్మెట్ అవసరాన్ని చెప్పి వారి వద్దనుంచి రూ.10 లు తీసుకుని హెల్మెట్లను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఆ టూ వీలర్స్ తిరిగి వచ్చేటప్పుడు ఈ హెల్మెట్లను అందజేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాకేష్ సాగర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ పంచాయతీలో మార్చినెలకు ముందుగానే ఈ హెల్మెట్ల బ్యాంకులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 

Also Read: ఎన్నారైల పెళ్ళి రిజిష్ట్రేషన్ తప్పని సరి : లేకపోతే ఆస్తులు జప్తు

Also Read: CBI మాజీ బాస్‌కు సుప్రీం తీర్పు : లక్ష కట్టు.. కోర్టులో ఓ మూలన కూర్చో

Also Read: మగ మినిస్టర్ చేతిదూల : వేదికపైనే మహిళా మంత్రిని గోకారు

Also Read: మనిషి బ్రతకటం కష్టమే : 100 ఏళ్లకు పురుగులు అంతం