ఇండియాలో ప్రతి 10వేల జనాభాకు 5 ఆస్పత్రులు..8.6 మంది వైద్యులు ఉన్నారంట : HDI రిపోర్ట్

India 5 Hospital Beds, 8.6 Doctors : ఇండియాలో కరోనా మహమ్మారి వ్యాప్తితో మన వైద్య మౌలిక సదుపాయాల డొల్లతనాన్ని బయటపడేసింది. కరోనా ఆరంభంలో దేశంలో పలు రాష్ట్రాలు వైద్య సదుపాయాల్లో కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని రాష్ట్రాల్లోని పలు ఆస్పత్రుల్లో కోవిడ్ పేషెంట్లకు తగినంత బెడ్స్, ఐసీయూలు అందుబాటులో లేవు. దేశ జనాభాకు వైద్యపరంగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కరోనా కారణంగా చాలావరకు వైద్య సదుపాయాల కొరతలో మెరుగుదల కనిపించింది. వాస్తవానికి ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో వైద్య మౌలిక సదుపాయాలు అధ్వన్నంగా ఉన్నాయి. దేశంలో జనాభాతో పోలిస్తే.. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య అతి స్వల్ప స్థాయిలో ఉంది.
ఇండియాలో ప్రతి 10వేల జనాభాకు ఆస్పత్రుల్లో కేవలం ఐదు బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయని, కేవలం 8.6 మంది వైద్యులే ఉన్నారని హ్యుమన్ డెవలప్ మెంట్ రిపోర్టు 2020లో వెల్లడైంది.
ప్రపంచంలో అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు కలిగినవి 12 దేశాలు మాత్రమే ఉండగా.. HDI సూచికలో భారత్ 155వ ర్యాంకులో నిలిచింది. అందులో ఉగాండా, సెనెగాల్, అఫ్గానిస్థాన్, బుర్కినా ఫాసో, నేపాల్, గుటేమాలా దేశాలు ఉన్నాయి.
మరోవైపు 2020 హ్యుమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ (HDI) ర్యాంకింగ్ జాబితాలో 189 దేశాల్లో భారత్ ఒక ర్యాంకుకు పడిపోయి 131వ ర్యాంకులో ఉంది. ఈ జాబితాను యూనైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (UNDP) విడుదల చేసింది. ఒక దేశంలో నివసించే జనాభాలో వైద్య, విద్య వంటి ఇతర సౌకర్యాలను HDI ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకుంటుంది.