India Covid : భారత్‌‌‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

24 గంటల్లో 16 వేల 051 కేసులు నమోదయ్యాయి. 206 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో...

India Covid : భారత్‌‌‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

India Covid

Updated On : February 21, 2022 / 10:08 AM IST

India Registers New Covid 19 Cases : భారతదేశంలో కరోనా మెల్లిమెల్లిగా తోకముడుస్తోంది. రోజు రోజు తక్కువగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. లక్షల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వేల సంఖ్యలో రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 16 వేల 051 కేసులు నమోదయ్యాయి. 206 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో పోల్చుకుంటే కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం దేశంలో 2,02,131 యాక్టీవ్ కేసులు ఉండగా, దేశంలో 0.47 శాతంగా యాక్టివ్ కేసులు ఉండగా, రోజువారీ పాజిటివిటి రేటు 1.93 శాతానికి చేరుకుందని తెలిపింది.

Read More : Bill Gates: ప్రపంచంపై మరో మహమ్మారి పడగెత్తనుంది: బిల్ గేట్స్ సంచలన ప్రకటన

దేశంలో ఇప్పటివరకు 4,28,38,524 కేసులు, 5,12,109 మరణాలు సంభవించాయని పేర్కొంది.దేశంలో 98.33 శాతంగా కరోన రికవరీ రేటు ఉందని, గత 24 గంటల్లో కరోనా నుంచి 37,901 మంది కోలుకున్నారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,21,24,284 గా ఉంది. దేశంలో కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,75,46,25,710 టీకాల డోసులను పంపిణీ చేసినట్లు, గత 24 గంటల్లో 7 లక్షల 706 మందికి వ్యాక్సిన్ డోసులను అందించినట్లు కేంద్రం వెల్లడించింది.