Bill Gates: ప్రపంచంపై మరో మహమ్మారి పడగెత్తనుంది: బిల్ గేట్స్ సంచలన ప్రకటన

కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోనేలేదు.. మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడనుందని బిల్ గేట్స్ హెచ్చరించారు.

Bill Gates: ప్రపంచంపై మరో మహమ్మారి పడగెత్తనుంది: బిల్ గేట్స్ సంచలన ప్రకటన

Bill Gates

Bill Gates: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోనేలేదు.. మరో మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడనుందని బిల్ గేట్స్ హెచ్చరించారు. CNBC ఛానల్ తో పరస్పర చర్చలో పాల్గొన్న బిల్ గేట్స్, కొత్త మహమ్మారి వేరే వ్యాధికారక నుండి వస్తుందని, కరోనావైరస్ కుటుంబం నుండి కాదని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చినందున COVID-19 నుండి తీవ్రమైన పరిణామాలు తగ్గాయని ఆయన తెలిపారు. అయితే సమీప భవిష్యత్తులో మరో కొత్త వైరస్ లేదా వ్యాధి ప్రబలి.. మహమ్మారిగా అవతరించి ప్రపంచాన్ని అతలాకుతలం చేయనుందని బిల్ గేట్స్ హెచ్చరించారు.

Also read: Britain : అప్పుడు మాస్క్‌‌లు, ఇప్పుడు హోం క్వారంటైన్‌‌కు గుడ్ బై

అటువంటి మహమ్మారి కారణంగా మనుషుల్లో తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం ఏక్కువగా ఉంటుందని, ప్రధానంగా వృద్ధులు, స్థూలకాయం, మధుమేహంతో బాధపడేవారిలో ఈ వ్యాధి ప్రభావం చూపుతుందని బిల్ గేట్స్ అన్నారు. అదే సమయంలో.. రానున్న మహమ్మారి నుంచి ప్రజలను రక్షించుకోవడానికి ప్రపంచ దేశాలు సంసిద్ధంగా ఉన్నట్లు కూడా గేట్స్ వివరించారు. గత రెండు శతాబ్దాల్లో కరోనా వంటి విపత్తుని చవిచూడని ప్రపంచ దేశాలకు.. దాన్ని ఎదుర్కొనేందుకు కొంత సమయం పట్టిందని.. అయితే ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మెరుగుపరచడంలో సాంకేతికత సహాయపడుతుందని గేట్ పేర్కొన్నాడు.

Also read: India-China: చైనా సహాయం తీసుకుంటే ఇక అంతే సంగతులు: భారత విదేశాంగ మంత్రి హెచ్చరిక

మెసెంజర్ RNA (mRNA) సాంకేతికతతో అది సాధ్యమవుతుందని వివరించారు. “తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు పెద్దగా ఖర్చు కూడా కాదని, అందరం హేతుబద్ధంగా ఉంటే ముందుగానే ఆ మహమ్మారిని పసిగట్టి ఎదుర్కోవచ్చని బిల్ గేట్స్ అన్నారు. ఇక 2022 మధ్య నాటికీ ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందన్న WHO లక్ష్యంపై బిల్ గేట్స్ స్పందిస్తూ..అది సాధ్యపడకపోవచ్చని అన్నారు. ఇదిలాఉంటే కరోనా వైరస్ తీవ్రత సహా వాతావరణ మార్పులు మరియు ప్రపంచ ఆరోగ్య సంక్షోభంపై బిల్ గేట్స్ గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమైన సందర్భాలు ఉన్నాయి.

Also read: Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా పాజిటివ్