India-China: చైనా సహాయం తీసుకుంటే ఇక అంతే సంగతులు: భారత విదేశాంగ మంత్రి హెచ్చరిక

భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ.. చిన్న దేశాలపై చైనా "అప్పుల ఉచ్చు" బిగుస్తుందని హెచ్చరించారు.

India-China: చైనా సహాయం తీసుకుంటే ఇక అంతే సంగతులు: భారత విదేశాంగ మంత్రి హెచ్చరిక

Jaishankar

India-China: మే 2020 గాల్వన్ ఘర్షణల అనంతరం భారత్ – చైనా మధ్య సత్సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని, 45 ఏళ్ల శాంతి సంధిని చైనా అతిక్రమించి ఎల్వోసీ వెంట తన బలగాలను మోహరింపజేసి చైనా దురాక్రమణకు పాల్పడిందని భారత విదేశీవ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జయశంకర్ అన్నారు. “ఇండో-పసిఫిక్” ప్రాంతంలో శాంతి భద్రతలు, ప్రాంతీయ క్రమబద్ధీకరణ అనే అంశంపై జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగిన సమావేశంలో ఎస్.జయశంకర్ పాల్గొన్నారు. క్వాడ్ సభ్య దేశాలైన ఆస్ట్రేలియా, జపాన్ ప్రతినిధులు సైతం ఈ సమావేశానికి హాజరైయ్యారు. ఈ సమావేశం అనంతరం జరిగిన మీడియా ప్రతినిధుల ప్రశ్నవళిలో ఎస్.జయశంకర్ మాట్లాడుతూ చైనా తీరుపై నిప్పులు చెరిగారు. ఇండో పసిఫిక్ తీరంలో స్వేచ్చాయుత వాణిజ్య వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా చైనా చర్యలున్నాయంటూ మండిపడ్డారు. ఆస్ట్రేలియా, జపాన్ ప్రతినిధులు సైతం భారత్ కు వత్తాసు పలుకుతూ చైనా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: Britain : అప్పుడు మాస్క్‌‌లు, ఇప్పుడు హోం క్వారంటైన్‌‌కు గుడ్ బై

గతంలో చైనాతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాల మేరకు 1975 నుంచి 2020 వరకు 45 ఏళ్ల పాటు.. భారత సరిహద్దు వద్ద ఎటువంటి భయానక పరిస్థితులు లేవని.. అయితే ఇటీవల చైనా దురాక్రమణలకు పాల్పడుతుందని ఎస్.జయశంకర్ వివరించారు. ముఖ్యంగా గాల్వన్ ఘర్షణల అనంతరం చైనా భరితెగించిందని, అందుకే చైనాతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అంతే కాకుండా ఇండో పసిఫిక్ తీరంపై ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్న చైనా కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పి కొడతామని వారు హెచ్చరించారు. అందుకోసం నాలుగు అంచెల భద్రతతో కూడిన “క్వాడ్ ప్లస్” కూటమిని తెరపైకి తేనున్నట్లు ఎస్.జయశంకర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న క్వాడ్ కూటమి(నాలుగు సభ్య దేశాలు)ని మరింత విస్తరించి ఇతర దేశాలను కూటమిలో భగస్వామ్యం చేసి చైనాకు అడ్డుకట్టవేయాలని ఈ సమావేశం సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.

Also read: Ukrain : యుక్రెయిన్ సంక్షోభం.. భేటీ కానున్న పుతిన్-బైడెన్

ఇదిలాఉంటే.. మ్యూనిచ్ సమావేశానికి సంబంధం లేకుండా అక్కడికి వచ్చిన బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఎ.కె అబ్దుల్ మోమెన్..స్పందిస్తూ, భారత విదేశాంగ మంత్రిని ఒక ప్రశ్న అడిగారు. తమ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చైనా “ఆర్ధిక సహాయం” చేసేందుకు ముందుకు వచ్చిందని..ఇతర దేశాల షరతులతో పోలిస్తే.. ఎటువంటి షరతులు లేకుండా చైనా ఆర్ధిక సహాయం చేస్తుందని..దేశాభివృద్ధి దృష్ట్యా చైనా ఆర్ధిక సహాయాన్ని పుచ్చుకోవాలా? అంటూ ఎ.కె అబ్దుల్ మోమెన్ అడిగారు. దీనిపై భారత విదేశాంగశాఖ మంత్రి జయశంకర్ స్పందిస్తూ.. చిన్న దేశాలపై చైనా “అప్పుల ఉచ్చు” బిగుస్తుందని హెచ్చరించారు.

Also read: Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా పాజిటివ్

ఆసియాలోని చిన్న దేశాలు సహా.. ఆఫ్రికాలోని మరికొన్ని దేశాలు చైనా నుంచి ఆర్ధిక సహాయం పొంది మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నాయని..కానీ ఆ సదుపాయాలను ఉపయోగించుకునేంత వాణిజ్యం ఆయా దేశాల్లో జరగక పోవడంతో.. అప్పులు తీర్చలేక చివరకు ఆ దేశాలు చైనా కుట్రకు బలైపోతున్నట్లు జయశంకర్ వివరించారు. చిన్న తరహా ప్రాజెక్టులంటూ.. “ఆయా దేశాల్లో రుణ ప్రాతిపదికన ఓడరేవులు, ఎయిర్ పోర్టులు చైనా నిర్మించినా..ఆ ఓడరేవుల్లోకి ఓడలు రాలేదు, ఎయిర్ పోర్టుల్లోకి విమానాలు రాలేదు” అని ఎస్.జయశంకర్ వివరించారు. దయచేసి మిగతా ప్రపంచ దేశాలు చైనా కుతంత్రాలను గ్రహించాలని ఆయన పిలుపునిచ్చారు.