Covid-19 Update : దేశంలో కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదు
భారత్ లో కోవిడ్ కేసులు తీవ్రత తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 255మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు.

india covid up date
Covid-19 Update : భారత్ లో కోవిడ్ కేసులు తీవ్రత తగ్గుముఖం పడుతోంది. నిన్న కొత్తగా 11,499 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 255మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. నిన్న కోవిడ్ నుంచి 23,598మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,22,70,482 కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 1,21,881 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కోంది. రోజువారీ కోవిడ్ రికవరీ రేటు 1.01 శాతానికి చేరుకుంది. దేశంలో ఇప్పటి వరకు 4,29,05.0844 కోవిడ్ కేసులు నమోదు కాగా….5,13,481 మరణాలు నమోదయ్యాయి.దేశంలో కరోనా రికవరీ రేటు 98.52 శాతంగా ఉంది. దేశంలో ఇంతవరకు 76,57 కోట్ల పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 177,17,68,379 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు అందించబడ్డాయి.