India Monkeypox : భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. రెండో కేసు నమోదు
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి.(India Monekypox)

Monkeypox
India Monkeypox : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్.. భారత్ లోనూ అలజడి సృష్టిస్తోంది. మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. మంకీపాక్స్ ముఖ్యంగా కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కేరళలో తొలి మంకీపాక్స్ నమోదు కాగా.. తాజాగా మరో మంకీపాక్స్ కేసును అధికారులు గుర్తించారు.
దుబాయ్ నుంచి కన్నూర్ కి వచ్చిన 31ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించగా.. తాజాగా వచ్చిన నివేదికలో అతడికి మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య రెండుకి చేరింది. కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సోమవారం తెలిపారు.(India Monkeypox)
Child Hepatitis : 35 దేశాల్లో చిన్నారులకు మిస్టరీ కాలేయ వ్యాధి..1000 కేసులు నమోదు..22మంది మృతి
మరో పాజిటివ్ కేసు నమోదవడంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో మంకీపాక్స్ కేసు నమోదైన రెండు రోజుల వ్యవధిలోనే మరో మంకీపాక్స్ కేసు నమోదుకావటం కలకలం రేపుతోంది. షార్జా-తిరువనంతపురం ఇండిగో విమానంలో వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ సోకిన వ్యక్తితో కలిసి తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయంకు చెందిన ప్రయాణికులు రావటంతో ఆ ఐదు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక జారీ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
ఇటీవల యూఏఈ నుంచి కేరళ వచ్చిన ఓ ప్రయాణికుడిలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించారు. అతడి నమూనాలు సేకరించి పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్ కు పంపగా.. ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.(India Monkeypox)
Monkeypox: మంకీపాక్స్ నివారణకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
కరోనావైరస్ మహమ్మారి తర్వాత అంతగా భయపెడుతున్న వ్యాధి మంకీపాక్స్. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు బయటపడుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారత్‌లోనూ మంకీ పాక్స్ కేసులు వెలుగులోకి రావటంతో భయాందోళన మొదలైంది. మన దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు కేరళలో నమోదైంది. ఇప్పుడు రెండో కేసు కూడా వెలుగుచూసింది.
దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే ప్రయాణికులు, విదేశాల నుంచి తిరిగి వస్తున్న వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
మంకీపాక్స్ ఇప్పటికే 59 దేశాలకు పాకింది. 6వేల మందిలో నిర్ధారణ కాగా.. వారిలో ముగ్గురు మరణించారు. మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్ ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలు, చికిత్స, తీసుకోవలసి జాగ్రత్తల గురించి తెలుసుకోవడం చాలా అవసరం.
మంకీపాక్స్ లక్షణాలు:
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు.
స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి.
ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందట.
ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి.
మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు.
ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు.
అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.