Child Hepatitis : 35 దేశాల్లో చిన్నారులకు మిస్టరీ కాలేయ వ్యాధి..1000 కేసులు నమోదు..22మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో చిన్నారులకు అంతుచిక్కని కాలేయ వ్యాధి వెంటాడుతోంది.గత కొన్ని నెలలుగా చిన్నారులో ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్నారు. ఇప్పటికే 35 దేశాల్లో 1000మంది చిన్నారులకు ఈ వ్యాధికి గురి కాగా 22మంది ప్రాణాలు కోల్పోయారు.

Child Hepatitis : 35 దేశాల్లో చిన్నారులకు మిస్టరీ కాలేయ వ్యాధి..1000 కేసులు నమోదు..22మంది మృతి

Mystery Child Hepatitis

Mystery child hepatitis : దాదాపు మూడేళ్లుగా కోవిడ్ ప్రపంచాన్ని కుదురుగా ఉండనివ్వటంలేదు. ఎంతోమంది ప్రాణాల్ని బలిగొన్న కోవిడ్ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడోక చోట ఏదోక దేశంలో ఏదోక వ్యాధి కలవర పెడుతోంది. ఎన్నో కొత్త కొత్త వైరస్ లో కల్లోలకం సృష్టిస్తున్నాయి. కోవిడ్ ముందు..కోవిడ్ తరువాత అన్నట్లుగా మారింది ప్రపంచ దేశాల పరిస్థితి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో చిన్నారులకు అంతుచిక్కని కాలేయ వ్యాధి వెంటాడుతోంది.గత కొన్ని నెలలుగా చిన్నారులో ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడుతున్నారు. ఇప్పటికే 35 దేశాల్లో 1000మంది చిన్నారులకు ఈ వ్యాధికి గురి కాగా 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

ఈ వ్యాధికి గల కారణాలను కనుక్కోవటానికి శాస్త్రవేత్తలు పరిశోధనలను ముమ్మరం చేశారు. అనారోగ్యంగా ఉండే చిన్నారులకే కాకుండా ఆరోగ్యంగా ఉన్న పిల్లలకు కూడా ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. చిన్నారుల్లో కనిపిస్తోన్న ఈ కాలేయ వ్యాధి తొలికేసు 2022 ఏప్రిల్‌ 5న బయటపడింది. జులై 8 నాటికి ఐదు రీజియన్లలోని 35 దేశాల్లో 1010 అనుమానిత హెపటైటిస్‌ కేసులు నమోదయ్యాయి. వ్యాధికారకాలను కనుగొనే దశలో ఉండగానే 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గడిచిన మూడు వారాల్లోనే కొత్తగా 90 కేసులు, నాలుగు మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల్లో సగం ఐరోపాలోనే నమోదుకాగా, మరో ఐదు వందల కేసులు 21 దేశాల్లో గుర్తించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం (7,2022) బులిటెన్‌లో తెలిపింది.

ఇప్పటివరకు 22మంది పిల్లలు మరణించగా వీటిలో సగం మంది ఐరోపాలోనే నమోదయ్యాయని తెలిపింది.ఒక్క బ్రిటన్‌లోనే 272 కేసులు నమోదుకాగా తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. పశ్చిమ పసిఫిక్‌, ఆగ్నేయాసియా, తూర్పు మెడిటేరియన్‌ ప్రాంతాల్లోని చిన్నారుల్లో ఈ మిస్టరీ కేసులు రికార్డయ్యాయి. అనుమానిత కేసులు ఇలా ఉన్నప్పటికీ వాస్తవంగా ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చు. అయినప్పటికీ చిన్నారుల్లో కనిపిస్తోన్న ఈ మిస్టరీ హెపటైటిస్‌ విజృంభణ తీరు నెమ్మదిగానే ఉందని చెప్పవచ్చు అని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది.

ఇప్పటి వరకు విశ్లేషించిన అనుమానిత కేసుల్లో 60శాతం మందిలో వికారం లేదా వాంతుల లక్షణాలే కనిపించాయి. 53శాతం మందిలో కామెర్లు 52శాతం బాధితుల్లో నీరసం,బలహీనత, 50శాతం కేసుల్లో కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. లక్షణాలు కనిపించింది మొదలు ఆస్పత్రిలో చేరటానికి నాలుగు రోజుల సమయం పడుతోందని పేర్కొంది. బాధిత చిన్నారుల్లో హెపటైటిస్‌ A నుంచి E వరకు లేవని.. కొన్ని కేసుల్లో కరోనా వైరస్‌ వంటి కారకాలను గుర్తించినప్పటికీ వాటిపై సమాచారం పూర్తిగాలేదని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. ఇందుకు అడినోవైరస్‌ కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ కచ్చితమైన కారకాల కోసం పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపింది