PUBG కాంపిటీషన్.. ప్రైజ్ మనీ రూ.2.5 లక్షలు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 05:28 AM IST
PUBG కాంపిటీషన్.. ప్రైజ్ మనీ రూ.2.5 లక్షలు

Updated On : April 28, 2020 / 5:28 AM IST

PUBG ప్లేయర్లందరికీ గుడ్ న్యూస్. India Today League Invitational 2020 పేరిట ఏప్రిల్ 23 నుంచి 26వ తేదీ వరకూ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ టోర్నీలో బెస్ట్ ప్రొఫెషనల్, సెమీ ప్రొఫెషనల్స్‌ను సెలక్ట్ చేసి ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 23నుంచి జరిగే ఈ టోర్నమెంట్ లో విజేతలకు రూ.2.5లక్షలు బహుమతిగా అందజేస్తారు. 

భారతదేశ వ్యాప్తంగా నిర్వహించే ట్రినిటీ గేమింగ్ తో పాటు సంయుక్తంగా ఇండియా టుడే లీగ్ నిర్వహిస్తుంది. గేమర్స్ లో ఈ లీగ్ ఫ్రీ ఫైర్ టోర్నమెంట్ గా నిలిచిపోనుంది. సంవత్సరం మొత్తానికి ఇండియా టుడే మరిన్ని ఈవెంట్లు చేయాలనే ఆలోచినలో ఉంది. ఇక ఈ టోర్నమెంట్ విషయానికొస్తే 4రోజులుగా 16 మ్యాచ్‌లు జరుగుతాయి. 

 

Erangie, Miramar, Sanhok and Vikendi డిఫరెంట్ మ్యాపింగ్ జోన్లలో నాలుగు రోజులు ఒక్కో మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ప్రతి గేమర్ కు గుర్తుండిపోవాలని.. గ్రేట్ టాలెంట్ వెలికితీయాలని ఈస్పోర్ట్స్ ఎరేనా ప్లాన్ చేస్తుంది. fnatic, TSM ENTTY, Orangerock, 8bit, SouL, Mayhem, SynerGE, VSG CRAWLERS, UME, Marcos Gaming, TeamIND, Megastars, Team Tamilas, Celtz, HYDRAOFFICIAL, GodLike, Element esports and Powerhouse టీంలు ఇండియా టుడే టోర్నమెంట్లో ఆడుతున్నాయి. 

పబ్ జీ మొబైల్ గురించి తెలియదా.. PLAYERUNKNOWN’S BATTLEGROUNDS 2017 నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి గేమర్ కి ఎంటర్‌టైన్మెంట్ అందిస్తుంది. 100ప్లేయర్ల వరకూ ప్యారాచూట్లో ఐలాండ్ లో ల్యాండ్ అయి బ్యాటిల్లో పాల్గొంటారు. ప్లేయర్లకు ఆయుధాలు, వాహనాలు ఇతర అవసరాలు అక్కడే దొరుకుతాయి. ప్రతి ఒక్క ప్లేయర్ ను ఓడించుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకుపోతుండాలి.