India vs Pakistan War: పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు ఆ ఎనిమిది మార్గాలు.. వ్యూహాత్మకంగా భారత్ అడుగులు..

పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి.

India vs Pakistan War: పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు ఆ ఎనిమిది మార్గాలు.. వ్యూహాత్మకంగా భారత్ అడుగులు..

India vs Pakistan War

Updated On : April 26, 2025 / 11:18 AM IST

India vs Pakistan War: పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పరిస్థితులు నెలకొన్నాయి. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతోపాటు పాకిస్థాన్ పై అన్నివైపుల నుంచి ఇరుకున పెట్టేందుకు భారత్ చర్యలు చేపట్టింది. పాక్ సైతం భారత్ పై కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో పహల్గాం ప్రతీకారానికి సంబంధించి మిలటరీ నిపుణులు భారత్ ముందు ఎనిమిది మార్గాలు ఉన్నాయని అంటున్నారు.. అవేమిటంటే..

Also Read: India vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తుందా..? ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయంటే..?

కాల్పుల విరమణ ఒప్పందం రద్దు, క్షిపణిదాడులు, టెర్రరిస్టు శిబిరాలపై దాడి, మాస్టర్ మైండ్లను మట్టుపెట్టడం, పూర్తిస్థాయిలో సైన్యం రంగంలోకి, అణ్వాయుధ విధానంలో మార్పు, సిమ్లా ఒప్పందం రద్దు, నౌకల అడ్డగింత వంటి ఎనిమిది మార్గాల్లో పాకిస్థాన్ పై దాడిచేస్తే పహల్గాం ఘటనపై ప్రతీకారం తీర్చుకోవచ్చనని మిలటరీ నిపుణులు పేర్కొంటున్నారు.

 

ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వస్తే భారత్ ఎల్వోసీని దాటడంలో మీనమేషాలు లెక్కించదనే విషయాన్ని బాల్ కోట్ సర్జికల్ స్ట్రయిక్ ప్రపంచానికి చాటి చెప్పింది. భారత్ తన ముందున్న ఎనిమిది మార్గాల్లో ఏది వాడినప్పటికీ అది ఎంచుకునే మార్గం పాకిస్థాన్ ను తలదించుకునేలా చేయాలని, పాకిస్థాన్ కనుసన్నల్లో భారతదేశంలో దాడులు చేసే ఉగ్రమూకలు కలలో కూడా పహల్గాం లాంటి దాడిని కనరాని విధంగా చేయాలనేది మిలటరీ నిపుణుల మాటగా ఉంది.